
పుణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న డిసైడెర్ వన్డేలో భారత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పిచ్ నుంచి లభిస్తున్న టర్న్‌ను అందిపుచ్చుకున్న ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, మోయిన్ అలీలు భారత్‌ను దెబ్బతీశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లతో 38), శిఖర్ ధావన్(56 బంతుల్లో 10 ఫోర్లతో 67)ను రషీద్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రషీద్.. శిఖర్ ధావన్‌ను రిటర్న్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(7)ని మోయిన్ అలీ క్లీన్ బౌల్డ్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు.
దాంతో భారత్ 121 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్, పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా లివింగ్‌స్టన్‌ను దింపిన జోస్ బట్లర్ ఫలితాన్ని రాబట్టాడు. రాహుల్(7)ను క్యాచ్‌ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో రిషభ్ పంత్(31 బ్యాటింగ్), హార్దిక్ పాండ్యా(1 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్-ధావన్ మంచి శుభారాంభాన్ని అందించారు. ప్రారంభం నుంచి పర్యాటక బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్ పవర్ ప్లే ముగిసేరికి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అనంతరం అదే జోరు కనబర్చిన ఈ జోడీ.. వరుస బౌండరీలతో చెలరేగింది.
ఈ క్రమంలో ధావన్ 44 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడిని ఇంగ్లండ్‌తో స్పిన్‌తో విడదీసింది. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక పిచ్‌పై టర్న్ లభిస్తుండటం భారత్‌ను కలవర పెడుతోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. అతను కూడా స్పెషలిస్ట్ స్పిన్నర్ కాదు. నలుగురు పేసర్లతో ఏ మేరకు రాణిస్తుందోననే ఆందోళన అభిమానులకు మొదలైంది.