Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: సూర్య సూపర్ ఫిఫ్టీ.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం!

India vs England: India post 185 after controversial 3rd umpire calls

అహ్మదాబాద్: సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) సూపర్ ఫిఫ్టీకి.. రిషభ్ పంత్(23 బంతుల్లో 4 ఫోర్లతో 30), శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37)ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, సామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.

నిరాశపరిచిన రోహిత్, రాహుల్..

నిరాశపరిచిన రోహిత్, రాహుల్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ(12) రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వచ్చి రావడంతో భారీ సిక్సర్‌తో పరుగుల ఖాతాను తెరిచాడు. లెగ్ స్టంప్ దిశగా ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను సూర్య అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత సూర్య రెండు ఫోర్లు కొట్టగా.. రాహులో ఓ ఫోర్ కొట్టడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. అనంతరం రషీద్ ఓవర్‌లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌ బాదిన సూర్య 14 పరుగులు పిండుకున్నాడు.

అయితే ఆ మరుసటి ఓవర్‌లోనే బెన్ స్టోక్స్ వేసిన స్లోయర్ బాల్‌కు కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన రాహుల్.. మిడాఫ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించి జోఫ్రా ఆర్చర్‌కు చిక్కాడు. గత మూడు మ్యాచ్‌ల్లో (1, 0, 0) విఫలమైన రాహుల్(14).. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(1).. రషీద్ బౌలింగ్‌లో స్టెప్ ఔటై స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు.

సూర్య సూపర్ ఫిఫ్టీ..

సూర్య సూపర్ ఫిఫ్టీ..

దాంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌తో సూర్య కుమార్ యాదవ్ ధాటిగా ఆడాడు. రషీద్ వేసిన 12 ఓవర్ ఆఖరి బంతిని తన మార్క్ షాట్‌తో బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ తరలించి 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీ అందుకోవడం విశేషం. ఇక అదే జోరు కనబర్చిన సూర్య.. సామ్ కరన్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని తనదైన రివర్స్ స్వీప్ షాట్‌తో భారీ సిక్సర్ కొట్టాడు. ఆ మరుసటి బంతిని కూడా అదే రీతిలో ఆడగా.. ఫైన్ లెగ్‌లో ఉన్న డేవిడ్ మలన్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే అతను క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు.

వివాదాస్పద నిర్ణయం..

వివాదాస్పద నిర్ణయం..

పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకినట్లు స్పష్టత లేకపోవడంతో నిబంధనల మేరకు ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాప్ట్ సిగ్నల్‌కు కట్టుబడి ఔటిచ్చాడు. దాంతో సూర్య(57) నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్‌ విషయంలో అంపైర్ నిర్ణయంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మెన్ కింద నాటౌట్ ఇవ్వాల్సిందని, ఫీల్డ్ అంపైర్ తొందరపడి సాఫ్ట్ సిగ్నల్ ఔటిచ్చాడని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదరగొట్టిన అయ్యర్..

అదరగొట్టిన అయ్యర్..

ఇక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో రిషభ్ పంత్ ధాటిగా ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఆర్చర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి దూకుడు కనబర్చిన పంత్(30) ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి హార్దిక్ పాండ్యా రాగా.. క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్‌లో పాండ్యా ఓ సిక్స్ కొట్టగా.. అయ్యర్ వరుస బంతుల్లో 6, 4 బాది 18 పరుగులు పిండుకున్నాడు. 19 ఓవర్‌ను మార్క్ వుడ్ కట్టుదిట్టంగా వేయగా.. స్టోక్స్ సూపర్ క్యాచ్ హార్దిక్ పాండ్యా(11) వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో అయ్యర్(37), సుంధర్(4) భారీ షాట్లకు ప్రయత్నించి వెనుదిరిగడంతో టీమిండియా 185 పరుగులకు పరిమితమైంది.

Story first published: Thursday, March 18, 2021, 21:21 [IST]
Other articles published on Mar 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+