For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఇంగ్లండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49

India vs England: India need 49 runs to go 2-1 up after England 81-all out

అహ్మదాబాద్: స్పిన్‌కు స్వర్గధామంగా నిలిచిన పిచ్‌పై భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్(4/48), అక్షర్ పటేల్ (5/32) చెలరేగడంతో ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 49 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్​ స్టోక్స్​( 25), జో రూట్​( 19) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్​ ఐదు వికెట్లు తీయగా, అశ్విన్​ 4 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. అనంతరం 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(6 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

అక్షర్ అదరహో..

అక్షర్ అదరహో..

33 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజాకు గాయం కావడం వల్ల అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్​.. అద్భుత బౌలింగ్​తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఆడుతున్నది రెండో టెస్టే అయినా నాలుగు ఇన్నింగ్స్​ల్లో మొత్తం మూడు సార్లు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇప్పటివరకు 19 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ బాల్‌కే జాక్ క్రాలీ(0)ని క్లీన్ బౌల్డ్ చేసిన అక్షర్.. మూడో బంతికి బెయిర్ స్టోను కూడా బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఖాతా తెరవకుముందే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం డామ్ సిబ్లీ(7)ని కూడా అక్షర్‌గా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. సిబ్లీ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

చెలరేగిన అశ్విన్

చెలరేగిన అశ్విన్

ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(25)తో జోరూట్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. దాంతో ఇంగ్లండ్ 50 పరుగులు పూర్తి చేసుకుంది. అయితే క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. స్టోక్స్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్‌కు చేర్చాడు. స్టోక్స్‌ను అశ్విన్‌ ఔట్ చేయడం ఇది 11వసారి. ఆ వెంటనే జోరూట్(19)ను అక్షర్ ఎల్బీగా ఔట్ చేసి ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓలిపోప్(12), జోఫ్రా ఆర్చర్(0), జాక్ లీచ్(9) అశ్విన్ ఔట్ చేయగా.. బెన్ ఫోక్స్(8)ని అక్షర్ పటేల్ పెలియన్ చేర్చాడు. చివరి వికెట్‌గా అండర్సన్‌ను సుందర్ క్యాచ్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

అశ్విన్400

అశ్విన్400

ఆర్చర్​ వికెట్ తీసిన అశ్విన్​.. సుదీర్ఘ ఫార్మాట్​లో 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బౌలర్​గా రికార్డు కెక్కాడు. అశ్విన్ కన్నా ముందు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ ఈ ఘనతను అందుకున్నాడు. మురళీ ధరణ్ 72 టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకుంటే.. అశ్విన్ 77 టెస్ట్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ 80 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

145 ఆలౌట్..

145 ఆలౌట్..

అంతకుముందు 99/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో సెకండ్ డే ఆటను కొనసాగించిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌటైంది. దాంతో కోహ్లీసేనకు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(5/8), స్పిన్నర్ జాక్ లీచ్(4/54) భారత్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీ మినహా అంతా విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు 46 పరుగుల మాత్రమే జోడించిన భారత్.. మిగతా ఏడు వికెట్లను జోరూట్, లీచ్‌లకు సమర్పించుకుంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే(25 బంతుల్లో 7), రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(8 బంతుల్లో 1), సుందర్(0), అక్షర్ పటేల్(0), రవిచంద్రన్ అశ్విన్(17) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో ఇషాంత్(10) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా బుమ్రా(1) ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Thursday, February 25, 2021, 19:21 [IST]
Other articles published on Feb 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+