India vs England:ముగిసిన తొలి రోజు ఆట.. భారత్‌దే ఆధిపత్యం!

అహ్మదాబాద్: భారీ అంచనాల మధ్య మొదలైన ఆఖరి టెస్ట్ తొలి రోజు ఆటలో భారత్ హవా నడిచింది. అచ్చొచ్చిన స్పిన్ అటాక్‌తో మరోసారి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌లో మాత్రం కొంత తడబాటుకు గురైంది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(34 బంతుల్లో 1 ఫోర్‌తో 8 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా(36 బంతుల్లో 1 ఫోర్‌తో 15 బ్యాటింగ్) నిలబడటంతో గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్‌లో తేలిపోయిన ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(55), డాన్ లారెన్స్(46) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్(4/66) నాలుగు, రవిచంద్రన్ అశ్విన్(3/47) మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్(2/45) రెండు, వాషింగ్టన్ సుందర్(1/14) ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ ఇంకా 181 పరుగుల వెనుకంజలో ఉంది. మొతేరా వేదికగానే జరిగిన మూడో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్ట్ కోసం ఫ్లాట్ పిచ్ సిద్దం చేసినా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications