
చెన్నై: భారత్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోరుపై కన్నేసింది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ జో రూట్, బెన్ స్టోక్స్ దూసుకుపోతున్నారు. రూట్ (156) 150 పరుగుల మార్క్ అందుకోగా.. స్టోక్స్ (63) హాఫ్ సెంచరీ చేశాడు. రూట్, స్టోక్స్ భారత బౌలర్లపై విరుచుకుపడడంతో రెండో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ 119 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 355 రన్స్ చేసింది. రూట్ (156), స్టోక్స్ (63) క్రీజులో ఉన్నారు.
263/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం ఆట ప్రారంభించిన జో రూట్, బెన్ స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఇంగ్లండ్ ప్లేయర్లు భారత బౌలర్లను ఈజీగా ఎదుర్కొన్నారు. పెద్దగా ప్రభావం లేని పిచ్‌పై.. రూట్, స్టోక్స్‌లు పరుగుల ప్రవాహం సృష్టించారు. బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. స్టోక్స్ రెండు సిక్సులు కూడా బాదాడు. ఈ ఇద్దరూ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 92 రన్స్ జోడించారు. అయితే స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌లను మనోళ్లు రెండుసార్లు వదిలేశారు. దీంతో హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు రూట్ తన శైలిలో ఆడుతూ 156 పరుగులు చేశాడు.
జో రూట్‌కిది 100వ టెస్టు కావడం విశేషం. చెన్నై టెస్టులో రూట్ 150+ స్కోర్లు సాధించాడు. ఇంతకుముందు శ్రీలంకతో ఆడిన 98, 99 టెస్టుల్లోనూ అతడు 150+ స్కోర్లు సాధించాడు. ఆ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 228, 186 పరుగులు సాధించాడు. అదే జోరుతో ఇప్పుడు హ్యాట్రిక్ శతకం (156)తో దూసుకుపోతున్నాడు. 98, 99, 100 టెస్టుల్లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా రూట్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 98, 99, 100వ మ్యాచ్‌ల్లో సెంచరీలు అందుకున్న తొలి క్రికెటర్‌గా రూట్ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.