
టెస్టుల పరిస్థితులు మార్చాడు:
తాజాగా ఇయాన్ ఛాపెల్ ఓ క్రీడా ఛానెల్లో రిషబ్ పంత్ గురించి మాట్లాడాడు. 'జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధాటిగా ఆడి రిషబ్ పంత్ మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడు. చాలా మంది తమ కెరీర్ మొత్తంలో కూడా ఇలా చేయలేరు. అయితే ఈ యువ క్రికెటర్ తన దూకుడు బ్యాటింగ్‌తోనే కాకుండా కీపింగ్‌లోనూ బాగా మెరుగయ్యాడు. పంత్ టీమిండియాలో పేరొందిన ఆటగాడు. అతడి స్ఫూర్తి, జట్టు ఆత్మవిశ్వాసానికి సరైన నిర్వచనం. ఇంగ్లండ్‌లోనూ ఇలాంటి ఆటగాళ్లున్నారు. కానీ వారికి సరైన పరిస్థితులు అనుకూలించలేదు' అని అన్నారు.

వికెట్లు కాపాడుకునేందుకు:
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు పరుగులు చేయడానికి ప్రయత్నిస్తే.. ఇంగ్లిష్ క్రికెటర్లు వికెట్లు కాపాడుకునేందుకు యత్నించారని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ పేర్కొన్నారు. ఇదే రెండు జట్ల మధ్య ప్రధాన తేడా అని ఆయన చెప్పుకొచ్చారు. గత 2-3 నెలల్లో రిషబ్ పంత్ టీమిండియాకు ఎంతో చేశాడని, అది మిగతా ఆటగాళ్లు జీవిత కాలంలో చేయలేరని తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్.. కూడా పంత్‌ను ప్రశంసించారు.

పేలవ ఆటతీరుతో:
గతంలో పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న రిషబ్ పంత్.. గత రెండు మూడు నెలల్లోనే భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ (97: 118 బంతుల్లో 12x4, 3x6), గబ్బా (89; 138 బంతుల్లో 9x4, 1x6) టెస్టుల్లో రెచ్చిపోయిన పంత్.. టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇంగ్లండ్‌తోనూ జరిగిన చివరి టెస్టులో శతకం (101; 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది.. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు.

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు:
రిషబ్ పంత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్దిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మెరిశాడు. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ చేశాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 270 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications

India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! సూర్యకుమార్ అరంగేట్రం!










