For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పిదం చేసిన థర్డ్ అంపైర్‌ కోసం సూర్య‌కుమార్ యాదవ్ వైఫ్ వెతుకులాట..!

India vs England: Hardik Pandya’s wife shares a funny story on Suryakumar Yadav’s wife

పుణె: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సతీమణి, బాలీవుడ్ హీరోయిన నటాషా స్టాన్‌కోవిచ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సరదా పోస్ట్‌ను షేర్ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో తీవ్ర దుమారం రేపిన థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ సిరీస్ నాలుగో మ్యాచ్‌తో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశాన్ని అందుకున్న సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. తనదైన 360 షాట్లతో హాఫ్ సెంచరీ సాధించి తనకొచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో మైదానం వీడాడు. ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగగా.. అంపైర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

India vs England: Hardik Pandya’s wife shares a funny story on Suryakumar Yadav’s wife

అయితే ఈ విషయం తాజాగా స్పందించిన నటాషా స్టాన్‌కోవిచ్ సూర్య సతీమణి దేవిషా శెట్టి ఫొటోను షేర్ చేస్తూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో దేవిషా శెట్టి బైనాక్యులర్ సాయంతో మ్యాచ్ చూస్తుండగా... ఆ పిక్‌ను షేర్ చేసిన నటాషా.. థర్డ్ అంపైర్ కోసం దేవిషా అన్వేశిస్తుందని సరదాగా క్యాప్షన్‌గా పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సూర్య.. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

అయితే టీ20 సిరీస్‌లో అదరగొట్టిన ఈ యువ ఆటగాడు వన్డే సిరీస్‌కు ఎంపికైనా.. మంగళవారం జరిగిన ఫస్ట్ వన్డేలో భారత తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ గాయపడటంతో రెండో వన్డేతో సూర్య అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అతను ఆడేందుకు మార్గమం సుగుమమైంది. తొలి వన్డేలో సూర్యకు అవకాశం ఇవ్వకపోవడంపై కూడా చాలా మంది పెదవి విరిచారు. ఇక ఫస్ట్ వన్డేలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా.. 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో బోణీ కొట్టింది. శుక్రవారం పుణె వేదికగానే రెండో వన్డే జరగనుంది.

Story first published: Wednesday, March 24, 2021, 13:48 [IST]
Other articles published on Mar 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+