For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో కోహ్లీ ప్రవర్తన చిన్న పిల్లాడిలా ఉంది: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

India vs England: Graeme Swann Slams ‘Childish’ Virat Kohli For His Verbal Altercation With Ben Stokes
Kohli-Stokes Fight: Graeme Swann Slams Kohli & Terms 'Childish' | IND V ENG 4th Test|Oneindia Telugu

అహ్మదాబాద్‌: మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తన చిన్న పిల్లాడిలా ఉందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. మొతేరా వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.ఈ గొడవ జరిగిన సమయంలో మ్యాచ్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గ్రేమ్ స్వాన్‌ కోహ్లీ తీరును తప్పుబట్టాడు.

అనవసర జోక్యం..

అనవసర జోక్యం..

'కోహ్లీ ప్రవర్తన నాకు నచ్చలేదు. సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేసిన స్టోక్స్‌తో కోహ్లీ అనవసరంగా మాటల యుద్దానికి తెరతీశాడు. ఆటలో బ్యాట్స్‌మన్, బౌలర్ మధ్య కవ్వింపులు ఉండటం సర్వ సాధారణం. కానీ కోహ్లీ అలా చేయలేదు. ఒక బౌలర్‌, బ్యాట్స్‌మన్‌ సంభాషణ మధ్యలో దూరడం సరికాదు. ఇదంతా చూస్తే కోహ్లీ మనసత్త్వం చిన్న పిల్లాడిలా అనిపించింది.' అని ఈ ఇంగ్లాండ్ కామెంటేటర్ చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఇక విషయంలోకి వెళితే.. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 12వ ఓవర్‌ మొదటి మూడు బంతుల్లో స్టోక్స్‌ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేసిన స్టోక్స్‌.. ఏవో వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని సిరాజ్ కోహ్లీకి తెలియజేయడంతో అతను జోక్యం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అంతలోనే అంపైర్లు నితిన్‌ మీనన్‌, వీరేందర్‌ శర్మ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు.. బెయిర్‌ స్టో మాత్రం నవ్వుతూనే స్టోక్స్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

తిట్టడంతోనే..

తిట్టడంతోనే..

ఇక తొలి రోజు ఆట అనంతరం ఈ గొడవ గురించి సిరాజ్ ముందు ప్రస్తావించగా.. బెన్ స్టోక్స్ తనను దూషించాడని తెలిపాడు. దాంతోనే విరాట్ కోహ్లీ జోక్యం చేసుకొని హ్యాండిల్ చేశాడన్నాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఓపికగా, ఓకే ప్రదేశంలో బంతులువేయాలనుకున్నామని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ విరాట్ కూడా ఇద్దరు పేసర్లే ఉన్నారని, తరుచూ రొటేట్ చేస్తానని చెప్పాడని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో 14 ఓవర్లు వేసిన సిరాజ్.. జోరూట్(5), బెయిర్ స్టో(28) రెండు కీలక వికెట్లు తీశాడు. ఇందులో 2 మెయిడిన్ ఓవర్లతో పాటు 45 పరుగులిచ్చాడు.

ఇంగ్లండ్ చెత్త బ్యాటింగ్..

ఇంగ్లండ్ చెత్త బ్యాటింగ్..

మూడో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంపై పిచ్‌పై గగ్గొలు పెట్టిన ఇంగ్లండ్.. ఆఖరి టెస్ట్‌లో బ్యాటింగ్ ట్రాక్‌పై కూడా దారుణంగా విఫలమైంది. టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/66), అశ్విన్ (3/47) మరోసారి మ్యాజిక్ చేయడంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(55), డాన్ లారెన్స్(46) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(34 బంతుల్లో 1 ఫోర్‌తో 8 బ్యాటింగ్), నయావాల్ చతేశ్వర్ పుజారా(36 బంతుల్లో 1 ఫోర్‌తో 15 బ్యాటింగ్)‌తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.

Story first published: Thursday, March 4, 2021, 20:06 [IST]
Other articles published on Mar 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+