For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సొంతగడ్డపై భారత్‌ను ఓడిస్తే అది యాషెస్ కంటే గొప్ప విజయం: ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్

India vs England: Graeme Swann Says Series win in India will be bigger than Ashes

చెన్నై: సొంతగడ్డపై భారత్ జట్టును ఓడిస్తే ఇంగ్లండ్‌కు అది యాషెస్ సిరీస్ కంటే గొప్ప విజయమవుతుందని ఆ జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. అయితే ఇదంతా సులువైన పనికాదని, ప్రస్తుతం భారత్ రెట్టించిన ఉత్సాహంలో ఉందన్నాడు. చెన్నై వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్ నేపథ్యంలో తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన గ్రేమ్ స్వాన్ ఈ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన అంచనా ప్రకారం ఈ సిరీస్‌ను 2-1తో కోహ్లీసేననే కైవసం చేసుకుంటుందని, కానీ ఇలా జరగకూడదని ఓ ఇంగ్లీష్ క్రికెటర్‌గా కోరుకుంటున్నానని ఈ మాజీ క్రికెటర్ తెలిపాడు.

బలంగా భారత్..

బలంగా భారత్..

'ప్రస్తుతం భారత జట్టు చాలా బలంగా ఉందనేది నా అభిప్రాయం. అయితే సొంతగడ్డపై భారత్‌ను ఓడిస్తే అది ఇంగ్లండ్‌కు ఖచ్చితంగా యాషెస్ సిరీస్ కంటే గొప్ప విజయం అవుతుంది. భారత్ జట్టు ఇటీవలే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డ ఓడించింది. వాస్తవానికి ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో ఓడించడం చాలా కష్టం. ఇక భారత్ పిచ్‌లపై స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇప్పుడు ఇంగ్లండ్ ముందున్న అతిపెద్ద సవాల్.

శ్రీలంకలో చూపించిన జోరే...

శ్రీలంకలో చూపించిన జోరే...

శ్రీలంకలో చూపించిన జోరునే ఇంగ్లండ్ కొనసాగిస్తుందనుకుంటున్నా. ముఖ్యంగా బంతితో భారత్‌లో చెలరేగుతారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. శ్రీలంక బలహీనమైన బ్యాటింగ్‌ ఇంగ్లండ్‌కు కలిసొచ్చిందనేది వాస్తవం. మా స్పిన్నర్లు డామ్ బెస్, జాక్ లీస్ అద్భుతంగా రాణించారు. ప్రస్తుతానికి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు కాకున్నా కొన్నేళ్లలో వారు కీలక స్పిన్నర్లుగా ఎదుగుతారు. శ్రీలంక కన్నా భారత జట్టు ఎన్నో రెట్లు బలమైనదనే విషయం వారికి తెలుసు.

పిచ్చి నిర్ణయం..

పిచ్చి నిర్ణయం..

ఇక భారత్‌ను ఒత్తిడిలో ఉంచాలంటే ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయాలి. కాకపోతే ఇంగ్లండ్ జోరూట్‌పైనే ఎక్కువగా ఆధారపడింది. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లకు బెయిర్ స్టో‌ను పక్కనపెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది. అలాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్‌కు ఎవరైనా విశ్రాంతినిస్తారా? ఇదో పిచ్చి నిర్ణయం. ఇక అశ్విన్ వరల్డ్ క్లాస్ ఆఫ్ స్పిన్నర్. అతను భారత్‌కు దొరికి ఓ ఆణిముత్యం.

భారత్‌దే సిరీస్..

భారత్‌దే సిరీస్..

అశ్విన్‌ను ఎదుర్కొవాలంటే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అంతా జోరూట్‌ను అనుసరించాలి. ఎందుకంటే అతనికి అశ్విన్‌పై మంచి రికార్డు ఉంది. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే టెక్నిక్ ఉంది. చాలా సెలెక్టివ్ షాట్స్ ఆడుతాడు. ఈ సిరీస్‌లో నా అంచనా ప్రకారం భారత్ 2-1తో గెలుస్తుంది. అయితే ఓ ఇంగ్లీష్ క్రికెటర్‌గా ఇది తప్పిదం కావాలని కోరుకుంటున్నా.'అని గ్రేమ్ స్వాన్ తెలిపాడు. 2008లో భారత్ గడ్డపైనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన గ్రేమ్ స్వాన్.. ఆ టూర్‌లో తేలిపోయాడు. కానీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్‌‌కి వచ్చిన ఇంగ్లండ్ టీమ్ టెస్టు సిరీస్‌ను 2-1తో గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.

Story first published: Friday, January 29, 2021, 11:02 [IST]
Other articles published on Jan 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+