For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: సెకండ్ టెస్ట్‌కు ఫ్యాన్స్.. కండీషన్స్ ఇవే!

India vs England: Face Masks And Social Distancing Mandatory For Fans During Second Test

చెన్నై: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు అభిమానుల అనుమతికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) సోమవారం విడుదల చేసింది. మైదానానికి వచ్చే ప్రతి ప్రేక్షకుడు తప్పనిసరిగా నోరు, ముక్కును కవర్ చేసే విధంగా ఫేస్ మాస్క్‌ను ధరించాలి. స్టేడియం లోపల భౌతిక దూరాన్ని పాటించాలి. కోవిడ్ లక్షణాలు అయిన జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వాళ్లను స్టేడియం లోపలికి అనుమతించరు.

మైదానంలోకి వచ్చిన వాళ్లు ఎలాంటి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయకూడదు. మతపరమైన, రాజకీయ, అసభ్యకరమైన కామెంట్ చేయకూడదు. కోవిడ్ రూల్స్, సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని టీఎన్‌సీఏ హెచ్చరించింది. బ్యాగ్స్, జోలాస్, బ్రీఫ్ కేస్, రేడియోస్, లేజర్ పాయింటర్స్, డిజిటల్ డైరీస్, ల్యాప్ టాప్స్, కంప్యూటర్స్, టేప్ రికార్డర్స్, రికార్డింగ్ డివైజెస్, బైనాక్యూలర్స్, టేప్ రికార్డర్స్, రికార్డింగ్ డివైజెస్, రిమోట్ కంట్రోల్డ్ డివైజెస్, ఇన్‌ప్లేమబుల్ మెటీరియల్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, స్పీకర్స్, వీడియో కెమెరాలను స్టేడియాల్లోకి తీసుకురావడాన్ని కూడా నిషేధించారు.

కరోనా కారణంగా గతేడాది నుంచి భారత్‌లో క్రికెట్‌ జరగలేదు. ఇంగ్లండ్‌ సిరీసుతోనే క్రికెట్‌ ఆరంభమైంది. ఆంక్షలు ఉండటంతో చెపాక్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకు అభిమానులను అనుమతించలేదు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించడంతో రెండో టెస్టు నుంచి 50 శాతం వీక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. 30 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న చెపాక్ స్టేడియంలో సుమారు 15వేల మందికి మ్యాచును వీక్షించే అవకాశం ఉంది. 2012 నుంచి మూసేసిన ఐ, జే, కే స్టాండ్లను తెరుస్తున్నామని కూడా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను సోమవారం (ఫిబ్రవరి 8) అమ్మడం మొదలుపెట్టారు.

Story first published: Tuesday, February 9, 2021, 10:00 [IST]
Other articles published on Feb 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+