
ధోనీ తర్వాత..
ఇక కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా కూడా మోర్గాన్ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ సారథి విలియమ్ పోర్ట్‌ఫీల్డ్ వెనక్కునెట్టాడు. ఈ జాబితాలో 72 మ్యాచ్‌లతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(72 మ్యాచ్‌లు) టాప్‌లో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని, వికెట్‌పై గడ్డి ఉందని మోర్గాన్ తెలిపాడు.

సంతోషంగా ఉంది..
సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ అని, సమష్టి రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక 100వ మ్యాచ్ ఆడటం పట్ల సంతోషంగా ఉందని, తనకు తన కుటుంబానికి ముఖ్యమైన రోజని మోర్గాన్ చెప్పుకొచ్చాడు. జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందని, టామ్ కరన్ స్థానంలో మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.
ఈ పర్యటనలోనే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌తో టెస్ట్‌ల్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఇయాన్ మోర్గాన్ పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనతను అందుకోవడం విశేషం.

కష్టాల్లో భారత్..
ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(0), రోహిత్ శర్మ(15) వికెట్లను త్వరగా కోల్పోయింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా.. వచ్చిన అవకాశాన్ని రాహుల్ అందిపుచ్చుకోలేకపోయాడు. పరుగుల ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక బ్రేక్ అనంతరం జట్టులోకి వచ్చిన రోహిత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే గత మ్యాచ్ విన్నర్ ఇషాన్ కిషన్(4) నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ బాట పట్టాడు. దాంతో భారత్ 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


Click it and Unblock the Notifications












