India vs England: ఇంగ్లండ్ తొండాట.. రాకాసి బౌన్సర్లతో అశ్విన్‌ను గాయపర్చేందుకు కుట్ర!

చెన్నై: భారత్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తుంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను గాయపర్చడమే లక్ష్యంగా ఇంగ్లండ్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా అతని బౌలింగ్ హ్యాండ్‌ను టార్గెట్ చేసుకొని ఇంగ్లండ్ పేసర్లు బంతులు సంధిస్తున్నారు. ఈ క్రమంలో అశ్విన్ మూడు సార్లు గాయపడ్డాడు. అశ్విన్ క్రీజులోకి రాగానే ఆర్చర్‌ను బౌలింగ్‌కు తీసుకొచ్చిన ఇంగ్లండ్.. మ్యాచ్ విన్నర్ అయిన అతన్ని గాయపర్చి బెంచ్‌కే పరిమితం చేయాలనే వ్యూహంతో తొండాటకు తెరదీసింది.

రాకాసి బౌన్సర్లతో
ఆర్చర్ వేసిన 37 ఓవర్‌లో రెండు షార్ట్ పిచ్ బంతులు అశ్విన్ శరీరంపైకే దూసుకొచ్చాయి. ఇందులో ఒకటి అతని చేతి వేలికి తగలగా.. టీమిండియా ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మరో బాల్ అతని బౌలింగ్ హ్యాండ్‌ను బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన అశ్విన్.. ఇంగ్లండ్ దుర్భుద్దిని గ్రహించి ప్రొటెక్షన్ తీసుకున్నాడు. ఆర్మ్ గార్డ్, చెస్ట్ ప్యాడ్ పెట్టుకొని బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆర్చర్ వేసిన 39వ ఓవర్‌లో నాలుగో బంతి అశ్విన్ హెల్మెట్‌ను తాకి బౌండరీకి వెళ్లింది. దాంతో మరొకసారి క్రీజులోకి వచ్చిన ఫిజియో నితిన్ పటేల్ కంకషన్ గాయాన్ని పరీక్షించాడు.

ప్రొటెక్షనే రక్ష..
ఇక ఈ సందర్భంగా కామెంటేటర్లు కూడా భవిష్యత్తు మ్యాచ్‌ల దృష్ట్యా ఇంగ్లండ్ అశ్విన్‌ను గాయపర్చాలనే వ్యూహం రచిస్తుందని చెప్పారు. ఇటీవల క్రికెట్‌లో స్టార్ ప్లేయర్లను ఇలా టార్గెట్ చేయడం సాధారణమైపోయిందన్నారు. ప్రొటెక్షన్ తీసుకొని ఆ వ్యూహాలను తిప్పికొట్టాలని సూచించారు. విరాట్‌కు ఒకలా... బుమ్రాకు మరొకలా బంతులు వేయడంతోనే వారి కుట్ర అర్థమవుతుందన్నారు. ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ (6/61) ప్రత్యర్థిని దెబ్బ తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జడేజా లేని లోటుతో టీమిండియా తడబడుతుండగా.. అశ్విన్ కూడా దూరమైతే పై చేయి సాధించవచ్చని ఇంగ్లండ్ భావిస్తోంది.

కష్టాల్లో భారత్..
39/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మళ్లీ తడబడింది. శుభ్‌మన్ గిల్(50) మంచి ఆరంభం అందించిన పుజారా(15) తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే నిలకడగా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌ను జేమ్స్ అండర్సన్ ఒకే ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(50), అజింక్యా రహానే(0) పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(11), సుందర్(0) కూడా తీవ్రంగా నిరశపరిచాడు. అండర్సన్ బౌలింగ్‌లో పంత్ క్యాచ్ ఔటవ్వగా.. సుందర్(0) డామ్ బెస్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ(45 బ్యాటింగ్), అశ్విన్(2 బ్యాటింగ్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 144/4 లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications