Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: మొదలైన మూడో రోజు ఆట.. 61 బంతుల్లోనే ఇంగ్లండ్ ఆలౌట్!

India vs England: England 578-all out after Ashwin, Bumrah strike

చెన్నై: భారత్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోర్ వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్‌ను ముగించింది. 555/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు.. మరో 10.1 ఓవర్లలో 23 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డామ్‌ బెస్‌ (34) మరో 6 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

జాక్‌ లీచ్‌ (14 నాటౌట్) మాత్రం అజేయంగా నిలవగా.. అశ్విన్ బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక మూడో రోజు ఆటలో కూడా కీపర్ రిషభ్ పంత్ తన తడబాటును కొనసాగించాడు. జాక్‌ లీచ్‌ను స్టంపౌట్ చేసే సునాయస అవకాశాన్ని పంత్ అత్యుత్సాహంతో చేజార్చాడు. అంతకుముందు పలు క్యాచ్‌లు నేలపాలు చేసిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. షబాజ్ నదీమ్, ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ జో రూట్‌ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో చెలరేగగా.. బెన్‌ స్టోక్స్‌ (118 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), డామ్ సిబ్లీ(87) శతకాలను చేజార్చుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఓవర్‌లో రెండు పరుగులు చేసింది. రోహిత్(1), శుభ్‌మన్ గిల్(1) క్రీజులో ఉన్నారు.

Story first published: Sunday, February 7, 2021, 10:38 [IST]
Other articles published on Feb 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+