IND vs ENG: కెప్టెన్ జోరూట్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్! మూడో టెస్ట్ డ్రీమ్ 11 ఇదే!

హైదరాబాద్: లార్డ్స్ టెస్ట్‌లో చిరస్మరణీయ విజయాన్నందుకున్న భారత జట్టు మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లార్డ్స్ టెస్ట్ విజయంతో 1-0తో ఆధిక్యంలో వెళ్లిన కోహ్లీసేన అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలనుకుంటుంది. మరోవైపు అనవసర తప్పిదాలతో విజయం ముంగిట బోల్తా పడిన జోరూట్ సేన.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఇప్పటికే తమ తప్పిదాలను సరిదిద్దుకునే క్రమంలో జట్టులో మార్పులకు తెరదీసిన ఆతిథ్య జట్టు.. లీడ్స్‌లో లెక్కసరి చేసి లార్డ్స్ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో మూడో టెస్ట్ పోరు కూడా హోరాహోరీగా జరగనుంది. అభిమానులకు కావాల్సిన మాజా లభించనుంది. మూడో టెస్ట్ డ్రీమ్ 11 టీమ్‌పై ఓ లుక్కెద్దాం.

ఇంగ్లండ్ టీమ్ న్యూస్..
గత రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ డామ్ సిబ్లీపై వేటు వేసిన ఇంగ్లండ్.. టీ20 స్పెషలిస్ట్ డేవిడ్ మలాన్‌ను జట్టులోకి తీసుకుంది. దాంతో రోరీ బర్న్స్‌కు జతగా హసీబ్ హమీద్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో డేవిడ్ మలాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. గాయాలతో బాధపడుతున్న క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ ఇంకా కోలుకోలేదు. దాంతో మూడో టెస్ట్ కోసం జట్టులోకి తీసుకున్న సకీబ్ మహమూద్ అరంగేట్రం చేసే అవకాం ఉంది. సాకిబ్ మహమూద్ పాకిస్థాన్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో దుమ్మురేపాడు. అండర్సన్, సామ్ కరణ్, ఓలీ రాబిన్సన్‌తో కలిసి సకీబ్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు.
ఇంగ్లండ్ తుది జట్టు:
రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జోరూట్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్(కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, రోరీ బర్న్స్, సకీబ్ మహమూద్, జేమ్స్ అండర్సన్

భారత జట్టు న్యూస్:
తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో టెస్ట్ బరిలోకి దిగే అవకాశం ఉంది. లీడ్స్ వాతావరణం దృష్ట్యా భారత్ తమ నలుగురు పేసర్లు, స్పిన్నర్ వ్యూహాన్ని పక్కనపెట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ అదే వ్యూహానికి కట్టుబడి ఉంటే మాత్రం బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన జడేజాపై వేటు పడనుంది. ఇక గాయం నుంచి కోలుకున్న శార్దూల్.. ఇషాంత్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కూడా అరంగేట్రం చేయనున్నాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే గత టెస్ట్‌లోనే ఫామ్ అందుకున్న పుజారాను పక్కనపెట్టకపోవచ్చు.
భారత్ తుది జట్టు:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ/రవీంద్ర జడేజా

డ్రీమ్ 11 ఫాంటసీ టిప్స్
వికెట్ కీపర్: రిషభ్ పంత్
బ్యాట్స్‌మన్: జోరూట్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ
ఆల్‌రౌండర్స్: రవీంద్ర జడేజా, మోయిన్ అలీ
బౌలర్లు: జేమ్స్ అండర్సన్, సకీబ్ మహమూద్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా
కెప్టెన్: జోరూట్, వైస్ కెప్టెన్: కేఎల్ రాహుల్

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్
మైఖేల్ డ్రీమ్ 11 టీమ్: రిషభ్ పంత్, జోరూట్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, మహమ్మద్ షమీ, జేమ్స్ అండర్సన్, సకీబ్ మహమూద్, జస్‌ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications