IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్లకు షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత! కారణం ఏంటంటే?

లండన్: ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ప్రారంభించే గొప్ప అవకాశాన్ని టీమిండియా తృటిలో కోల్పోయింది. వరణుడి కారణంగా నాటింగ్‌హామ్‌లో ఆ అదృష్టం భారత్‌కు దక్కలేదు. మొదటి టెస్ట్ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకపోయింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక రెండవ టెస్టు ఆగష్టు 12 నుంచి (గురువారం) లార్డ్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సమయంలో భారత్, ఇంగ్లండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్లకు జరిమానా విధించింది ఐసీసీ.

మ్యాచ్ ఫీజులో 40% కోత
ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్, ఇంగ్లండ్ జట్లతో వరుణుడు దోబూచులాడిన విషయం తెలిసిందే. మొదటి మరియు నాలుగవ రోజు మాత్రమే ఆట సజావుగా సాగింది. రెండు, మూడు రోజుల్లో మూడో సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఐదవ రోజు అయితే ఒక్క బంతి కూడా పడలేదు. అయితే ఆట జరిగిన రోజుల్లో కూడా భారత్, ఇంగ్లండ్ జట్లు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేశాయి. నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే.. ఇరు జట్లు తక్కువగా వేశాయి. దీంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఇరు జట్ల ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40% కోత విధించాడు.

చెరో రెండు పాయింట్లు
మ్యాచ్ ఫీజుతో పాటు ఇరు జట్ల ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లలో కూడా కోత విధించాడు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్. మ్యాచ్ డ్రా కావడంతో కొత్త డబ్ల్యూటీసీ రూల్స్ ప్రకారం భారత్, ఇంగ్లండ్ జట్లకు చెరో నాలుగు పాయింట్స్ వచ్చాయి. అయితే స్లో ఓవర్-రేట్ కారణంగా ఇరు జట్లలో చెరో రెండు పాయింట్లను జరిమానాగా విధించారు.
దీంతో ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల ఖాతాలో చెరో రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. డబ్ల్యూటీసీ భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌తోనే ఆరంభం అయిన విషయం తెలిసిందే. ఓవర్-రేట్ టెస్ట్ క్రికెట్‌లో దీర్ఘకాల సమస్యగా ఉంది. దీన్ని అధిగమించేందుకే ఐసీసీ జరిమానా విధిస్తోంది.
IND vs ENG: ఫీల్డింగ్ కోచ్ వినూత్న ప్రయత్నం.. టీమిండియా ఆటగాళ్ల ఏకాగ్రతకు పరీక్ష (వీడియో)!!

మరో భారీ షాక్
భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న రెండో టెస్ట్‌కు ముందు రెండు టీమ్స్‌కు మరో భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, టీమిండియా యువ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయపడ్డారు. శార్దూల్ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడట. రెండో టెస్ట్ కోసం మంగళవారం సాధన చేసేటప్పుడు అతడి కండరాలు పట్టేశాయి. శార్దూల్ గాయం తీవ్రతపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారమైతే లేదు.
ఆడలేని పరిస్థితిలో ఉంటే మాత్రం సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండో టెస్ట్ ఆడనున్నాడు. తొలి టెస్టులో వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ను కాదని శార్దూల్‌ను తీసుకున్నారు. ఇంగ్లండ్‌లో నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ కూర్పుతో ఆడతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంతకు ముందే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ను చోటు దక్కడం కష్టమేనని అనిపిస్తోంది.

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా/హనుమ విహారీ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), రవింద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలీ/హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్/మొయిన్ అలీ, జొస్ బట్లర్, సామ్ కరన్, ఓలీ రాబిన్‌సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications