India vs England: వారెవ్వా రూట్ వాటే క్యాచ్.. బిత్తరపోయిన రహానే! (వీడియో)

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(11)తో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(1) వికెట్లను కోల్పోయింది. ఈ ఇద్దర్ని డామ్ బెస్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చి దెబ్బ తీశాడు. తొలుత కెప్టెన్ విరాట్ కోహ్లీ(11)ని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన డామ్ బెస్.. తన మరుసటి ఓవర్‌లోనే రహానే(1)ను కూడా జోరూట్ సూపర్ డైవ్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. దాంతో భారత్ 73 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో నయావాల్ చతేశ్వర్ పుజారా(26 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(0) ఉన్నారు.
జోరూట్ సూపర్ క్యాచ్..
డామ్ బేస్ వేసిన టర్న్ కమ్ షార్ప్ బౌన్సర్‌ను అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ.. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పోప్‌కు చిక్కాడు. బేస్ మరుసటి ఓవర్‌లో అతను వేసిన ఫుల్‌టాస్‌ను ముందుకు వచ్చి ఆడిన రహానే.. జోరూట్ సూపర్ డైవ్ క్యాచ్‌కు నిరాశగా వెనుదిరిగాడు. ఇక జోరూట్ మైమరిపించే ఫీల్డింగ్‌కు రహానేతో పాటు మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా అవాక్కయ్యారు.

ఒత్తిడిలో టీమిండియా..
ఈ రెండు వికెట్లతో ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం అమాంతం పెరగగా.. ఇండియా తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభ్‌మన్ గిల్(29) తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దర్ని జోఫ్రా ఆర్చరే పెవిలియన్ చేర్చాడు. తొలుత రోహిత్ శర్మను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన ఆర్చర్.. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన శుభ్‌మన్ గిల్‌ను అండర్సన్ సూపర్ క్యాచ్ సాయంతో ఔట్ చేశాడు.

ఇంగ్లండ్ 578 ఆలౌట్..
అంతకుముందు ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయింది. 555/8 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన రూట్ సేన మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్‌ను ముగించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జో రూట్ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్ (118 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), డామ్ సిబ్లీ(87) శతకాలను చేజార్చుకున్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. షబాజ్ నదీమ్, ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications