అరంగేట్రంలో అదరగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్యా.. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం!

పూణే: మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో పుణె వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అరంగేట్ర పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ చెలరేగడంతో 318 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్.. 42.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 66 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. జానీ బెయిర్‌స్టో (94; 66 బంతుల్లో 6×4, 7×6), జేసన్ రాయ్ (46; 35 బంతుల్లో 7×4, 1×6) విధ్వంసాలకు శార్దూల్, ప్రసిద్ధ్ అడ్డుకట్టవేశారు. భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు. అంతకుముందు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (98; 106 బంతుల్లో 11×4, 2×6) శతకం చేజార్చుకున్నాడు. ఇక రెండో వన్డే 26న ఇదే మైదానంలో జరుగనుంది.

భయపెట్టిన బెయిర్‌స్టో:
భారీ లక్ష్య ఛేదనలో జానీ బెయిర్‌స్టో (94: 66బంతుల్లో 6ఫోర్లు, 7సిక్సర్లు) ఇంగ్లండ్‌కు శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (46: 35 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించాడు. ఫ్లాట్ పిచ్‌పై ఇంగ్లండ్ ఛేదనను అడ్డుకోవడం కోహ్లీసేనకు అంత తేలిగ్గా కుదర్లేదు. మొదటి వికెట్ కోసం 15వ ఓవర్ దాకా ఎదురుచూసింది. కానీ అంతలోపే ఇంగ్లిష్ ఓపెనర్లు చేయాల్సిన నష్టం చేసేశారు. అరంగేట్రం బౌలర్లు ప్రసిధ్ కృష్ణ, కృనాల్ పాండ్యా.. శార్దూల్ బౌలింగ్‌ను ఊచకోత కోశారు. 10 ఓవర్లకు 89, 14 ఓవర్లకు 131 బాదేశారు. ముఖ్యంగా బెయిర్ స్టో మైదానం చుట్టూ సిక్సర్లు బాదేశాడు. 40 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు.

మెరిసిన ప్రసిద్ధ్, శార్దుల్:
అయితే 14.2వ బంతికి రాయ్‌ను ఔట్ చేయడం ద్వారా ప్రసిద్ధ్ ఈ జోడీని విడదీశాడు. తన తర్వాతి ఓవర్లోనే బెన్ స్టోక్స్ (1)ను కూడా పెవిలియన్ పంపించాడు. బెయిర్‌స్టో మాత్రం తన దూకుడును కొనసాగించాడు. సెంచరీకి చేరువలో శార్దుల్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో వెనుదిరగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కకావికలమైంది. శార్దుల్, ప్రసిధ్ ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. శార్దుల్ ఒకే ఓవర్లో ఇయాన్ మోర్గాన్ (22; 30 బంతుల్లో 1×4, 1×6), జోస్ బట్లర్ (2; 4 బంతుల్లో)లను పెవిలియన్ పంపడంతో భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. మొయిన్ అలీ (30; 37 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. భువీ అతడిని ఔట్ చేసి గెలుపు ఖాయం చేశాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు.

గర్జించిన గబ్బర్:
టాస్ ఓడిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ (28; 42 బంతుల్లో 4×4), శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చెత్త బంతులకు మాత్రమే పరుగులు చేయడంతో 10 ఓవర్లకు 39/0తో నిలిచింది. స్టోక్స్ వేసిన 16 ఓవర్లో దూరంగా వెళ్తున్న బంతిని ఆడి రోహిత్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో కోహ్లీతో కలిసి గబ్బర్ చెలరేగాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం అందించారు. గబ్బర్ 68 బంతుల్లో, కోహ్లీ 50 బంతుల్లో అర్ధ శతకాలు చేశారు. జట్టు స్కోరు 169 వద్ద వుడ్.. కోహ్లీని పెవిలియన్ పంపాడు. మరికాసేపటికే శ్రేయస్ అయ్యర్ (6; 9 బంతుల్లో 1×4) ఔటయ్యాడు.

చెలరేగిన రాహుల్, కృనాల్:
ఇక శతకానికి చేరువైన గబ్బర్ మరీ నెమ్మదిగా ఆడాడు. సెంచరీకి 2 పరుగుల దూరంలో.. స్టోక్స్ షార్ట్ పిచ్‌లో వేసిన బంతిని పుల్ చేయబోయి మోర్గాన్‌కు చిక్కాడు. దీంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (1; 9 బంతుల్లో) కూడా తడబడ్డాడు. కేఎల్ రాహుల్ ఫామ్‌లో లేకపోవడంతో భారత్ 250 మార్క్ దాటుతుందా అనిపించింది. అయితే అరంగేట్రం ఆటగాడు కృనాల్ వచ్చిరాగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరోవైపు రాహుల్ కూడా వేగం అందుకున్నాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆఖరి 5 ఓవర్లలో 67 పరుగులు సాధించారు. మార్క్‌వుడ్ 3, బెన్‌స్టోక్స్ 2 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
India vs England: పంత్‌ను పక్కనపెట్టారు ఓకే.. మరి సూర్యకుమార్‌ను ఎందుకు తీసుకోలేదు! చాలా ఆశ్చర్యంగా ఉంది!