For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ.. అంపైర్లను ప్రభావితం చేస్తున్నాడు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

India vs England: David Lloyd says Virat Kohli was trying to influence umpires

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్​ మాజీ క్రికెటర్​ డేవిడ్​ లాయిడ్​ నోరుపారేసుకున్నాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ​ అతిగా అప్పీలు చేస్తూ.. అంపైర్లను ప్రభావితం చేన్నాడని ఆరోపించాడు. రహానే అద్భుత కెప్టెన్సీలో ఆస్ట్రేలియా సిరీస్​ను గెలుపొందిన తర్వాత.. కోహ్లీ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని యూకే డైలీ మెయిల్‌కు రాసిన కాలమ్‌లో ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాసుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ అతి...

విరాట్ కోహ్లీ అతి...

'తొలి టెస్టు నాలుగో రోజు విరాట్​ కోహ్లీ అతిగా అప్పీలు చేశాడు. సెకండ్ సెషన్​లో రెండు షాకింగ్​ రివ్యూలు కోరాడు. దీనిపై కామెంటేటర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను మాత్రం అంపైర్లను ప్రభావితం చేయడానికే భారత కెప్టెన్​ ఇలా చేశాడని భావిస్తున్నాను.'అని డేవిడ్​ లాయిడ్​ పేర్కొన్నాడు. ఇక ఇలాంటి విషయాలను భారత ఆటగాళ్లు పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుత సిరీస్​లో తటస్థ అంపైర్లు లేరనే విషయం కూడా తెలిసిందే.

కష్టాల్లో భారత్..

కష్టాల్లో భారత్..

39/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మళ్లీ తడబడింది. జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అండర్సన్ ఒకే ఓవర్‌లో శుభ్‌మన్ గిల్(50), అజింక్యా రహానే(0) పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. ముందుగా మంచి ఇన్‌స్వింగర్‌తో శుభ్‌మన్ గిల్ ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టిన అండర్సన్.. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన రహానేను వికెట్ల ముందు బోల్తా కొట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అంపైర్లు నాటౌట్ ఇవ్వడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారు. అయితే బాల్ ట్రాకర్‌లో బంతి ఆఫ్ స్టంప్‌ను హిట్ చేయడంతో అంపైర్స్ కాల్‌తో రహానే బతికిపోయాడు. కానీ అండర్సన్ మరుసటి బంతికే రహానేను బౌల్డ్ చేశాడు.

పంత్, సుందర్ కూడా..

పంత్, సుందర్ కూడా..

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(11) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అండర్సన్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే సుందర్(0) కూడా డామ్ బెస్ బౌలింగ్‌లో ఔటవ్వడంతో భారత్ 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి అశ్విన్ రాగా.. డ్రా కోసం విరాట్ కోహ్లీ పోరాడుతున్నాడు. వరుసగా వికెట్లు కోల్పవోడంతో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి 39 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(45 బ్యాటింగ్), అశ్విన్(2) ఉన్నారు. భారత్ ఇంకా 276 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Tuesday, February 9, 2021, 11:56 [IST]
Other articles published on Feb 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+