Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మైదానంలో విరాట్ కోహ్లీ ప్రవర్తన బాలేదు.. అంపైర్లకు గౌరవం ఇవ్వడం లేదు!

India vs England: David Lloyd says India captain has been disrespecting umpires

న్యూఢిల్లీ: మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తన ఏ మాత్రం బాలేదని, అంపైర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ మండిపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌తో కోహ్లీ ఇటు అంపైర్లు, అటు ప్రత్యర్థి ఆటగాళ్లతో తరచూ వాగ్వాదాలకు దిగుతున్నాడని, తన మాటలు, చేతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.

నాలుగో టీ20లో భాగంగా 'సాఫ్ట్‌ సిగ్నల్‌' కాల్‌తో సూర్యకుమార్‌ యాదవ్‌ ఔటైన తీరుపై కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంపైర్లపై ఇంగ్లండ్‌ ఒత్తిడి తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అంపైర్లపై ఒత్తిడి తెస్తున్నారు..

అంపైర్లపై ఒత్తిడి తెస్తున్నారు..

ఈ నేపథ్యంలో యూకే డెయిలీ మెయిల్‌కు రాసిన కాలమ్‌లో డేవిడ్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'డేవిడ్‌ మలన్‌ క్యాచ్‌ ఉదంతం నేపథ్యంలో 'అంపైర్లపై ఇంగ్లండ్‌ ఒత్తిడి తెస్తుంది' అని కోహ్లీ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతో నాకు తెలియదు. కానీ, కోహ్లీ మాత్రం వారిపై ఒత్తిడి తెస్తున్నాడు, వాళ్లను గౌరవించడం లేదు. ఈ పర్యటన మొత్తం వారితో విభేదిస్తున్నాడు. ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం జరిగిన తొలి వన్డేలోనూ (బట్లర్‌తో వాగ్వాదం) అలాంటిదే జరిగింది.

జాగ్రత్తగా ఉండాలి..

జాగ్రత్తగా ఉండాలి..

మైదానంలో ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగకూడదు. నోరు లేని ఐసీసీ కూడా ఏం చేయలేకపోయింది' అని లాయిడ్‌ తీవ్రంగా స్పందించాడు. అలాగే విరాట్‌ కోహ్లీ ఇప్పుడున్న హోదాలో.. తను ఏం మాట్లాడినా, ఏం చేసినా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఆటగాళ్ల ప్రవర్తనపై అంపైర్లు తగిన చర్యలు తీసుకునేలా.. ఎల్లో, రెడ్ కార్డులు అందజేయాలి. ఎందుకంటే అంపైర్లు ఇప్పుడు ఏ చర్య తీసుకునేలా కనిపించడంలేదు' అని ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు పేర్కొన్నాడు.

రెండు రోజుల్లో ముగుస్తుంది..

రెండు రోజుల్లో ముగుస్తుంది..

అదే విధంగా అంపైర్స్‌ కాల్‌ నిబంధనను కోహ్లీ రద్దు చేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ''తొలి వన్డేకు ముందు, డెసిషన్‌ రివ్యూ సిస్టంలో భాగమైన అంపైర్స్‌ కాల్‌ నిబంధనను తొలగించాలని విరాట్‌ కోహ్లి అన్నాడు. ఒకవేళ బాల్‌, స్టంప్స్‌లోని ఏ భాగానికి తాకినా అది అవుట్‌ అని ఇవ్వాలి. ఇలా ప్రతీది అవుట్‌ అని ఇస్తూ పోతే, టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లో, వన్డే​ నాలుగు గంటల్లో పూర్తైపోతుంది. కోహ్లి మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి తను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి'' అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Thursday, March 25, 2021, 13:25 [IST]
Other articles published on Mar 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+