For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్ నీ ఆట మార్చుకోవద్దు.. కానీ ఆ ఒక్కటి తెలుసుకో: పుజారా

India vs England: Cheteshwar Pujara says Rishabh Pant needs to be more sensible

చెన్నై: టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తన ఆటను మార్చుకోవాల్సిన అవసరం లేదని అతని సహచర ఆటగాడు, నయావాల్ చతేశ్వర్ పుజారా అన్నాడు. పంత్ నేచురల్ అటాకింగ్‌ను తగ్గించుకోవాల్సిన పనిలేదన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో రిషభ్ పంత్(88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91) విధ్వసంకర బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే పంత్ మళ్లీ 9 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. అతని 17 టెస్ట్‌ల కెరీర్‌లో ఇలా సెంచరీకి చేరువై ఔటవ్వడం నాలుగోసారి. ఈ నేపథ్యంలో పంత్‌కు మ్యాచ్ అనంతరం మాట్లాడిన పుజారా.. పలు సూచనలు చేశాడు.

 అదొక్కటి తెలుసుకుంటే..

అదొక్కటి తెలుసుకుంటే..

దూకుడుగా ఆడుతూనే.. టీమ్ అవసరాలకు అనుగుణంగా షాట్ సెలెక్షన్‌లో సెన్సిబుల్‌గా ఆలోచించాలని సూచించాడు.'దూకుడుగా ఆడటం రిషభ్ పంత్ సహజ శైలి. దానిని మనం అడ్డుకోవద్దు. ఎక్కువ డిఫెన్స్ కూడా అవసరం లేదు. అలా చేస్తే అతను తొందరగా ఔటవుతాడు. ఇలా షాట్స్ ఆడటం గేమ్‌కు చాలా మంచిది. కాకపోతే సెలెక్టివ్‌గా ఉండాలి. ఏ షాట్ ఆడాలి. ఏది ఆడోద్దు అనేది తెలుసుకుంటే చాలు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో క్రీజులో ఉండేందుకు ప్రయత్నించాలి.

 కోచింగ్ స్టాఫ్ మాటలు వింటే..

కోచింగ్ స్టాఫ్ మాటలు వింటే..

పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ ఆటను కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పుడు చేస్తున్న తప్పిదాల నుంచి పంత్ కచ్చితంగా నేర్చుకుంటాడు. ఇంకాస్త ఓపికను పెట్టి, మరో భాగస్వామ్యాన్ని నిర్మిస్తే బాగుండేది. అతను ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం వల్ల టీమ్ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్తుంది.'అని పుజారా పేర్కొన్నాడు. కోచింగ్ స్టాఫ్ మాటలను శ్రద్దగా వింటే ఇలాంటి తప్పులను పు నరావృతం చేయబోడన్నాడు. ఇక 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును పంత్, పుజారా(143 బంతుల్లో 11 ఫోర్లతో 73) ఐదో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి గట్టెక్కించారు.

ఆ చిన్న తేడాను గ్రహించాలి..

ఆ చిన్న తేడాను గ్రహించాలి..

ఇక సునీల్ గవాస్కర్ సైతం పంత్ ఇదే సూచించాడు. కేర్‌లెస్, కేర్ ఫ్రీ మధ్య ఉన్న చిన్న తేడాను గ్రహించాలన్నాడు. 'రిషభ్ పంత్ ఎప్పుడూ దూకుడైన ఆటగాడే. అతని బ్యాటింగ్‌ను అందరూ చూడాలనుకుంటారు. ఎందుకంటే పంత్ తన ఆటను ఆస్వాదిస్తూ ఆడుతాడు. అయితే రిషభ్ పంత్ ప్రతీసారి నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వికెట్ పారేసుకుంటున్నాడు. అతను కేర్‌ఫ్రీ, కేర్‌లెస్ మధ్య ఉన్న చిన్న తేడాను గ్రహిస్తే మరింత నిలకడగా రాణిస్తాడు. జాక్‌ లిచ్ బౌలింగ్‌ను పంత్ ఎదుర్కొన్న తీరు అద్భుతం.'అని గవాస్కర్ తెలిపాడు. పంత్ ధాటికి లిచ్ తొలి 6 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చుకున్నాడు. డామ్ బెస్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌కు ప్రయత్నించిన పంత్.. లిచ్‌కే చిక్కి వెనుదిరిగాడు.

కష్టాల్లో భారత్..

కష్టాల్లో భారత్..

ఇంగ్లండ్ చేతిలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్‌ తేలిపోతోంది. తొలి టెస్టులో భారత్‌ కష్టాల నావతో ఏటికి ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు భారత్‌ ఇంకా 321 పరుగుల దూరంలో ఉంది. చతేశ్వర్‌ పుజారా , రిషభ్‌ పంత్‌ (88 బంతుల్లో 91; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించినా.. వారి ఆట ఒడ్డున పడేసేదాకా సాగలేదు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ (4/55), పేసర్‌ ఆర్చర్‌ (2/52) భారత బ్యాటింగ్‌ను చెదరగొట్టాడు. ఫాలోఆన్‌ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్‌ మిగిలున్న 4 వికెట్లతో 122 పరుగులు చేయాలి. వాషింగ్టన్‌ సుందర్‌ (33 బ్యాటింగ్‌), అశ్విన్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

Story first published: Monday, February 8, 2021, 9:07 [IST]
Other articles published on Feb 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+