India vs England: పాపం పుజారా.. మళ్లీ వెంటాడిన దురదృష్టం (వీడియో)

చెన్నై: టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో దురదృష్టవశాత్తు ఔటైన పుజారా.. సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఊహించని విధంగా పెవిలియన్ చేరాడు. మూడో రోజు ఆటలో ఈ టీమిండియా నయావాల్ అనూహ్యరీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి బంతిని హిట్ చేసేందుకు చతేశ్వర్ పుజారా (7) ప్రయత్నించాడు. కానీ.. టర్న్ అయిన బంతి అతని బ్యాట్‌కు అందకుండా ఫ్యాడ్‌ను తాకి షార్ట్ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్ చేతుల్లో పడింది.
బ్యాట్ జారీ..
బంతిని అందుకున్న ఓలీ పోప్.. పుజారా క్రీజులో లేకపోవడంతో వేగంగా వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌కి బంతిని త్రో చేశాడు. దాంతో.. రనౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన చతేశ్వర్ పుజారా వెంటనే క్రీజులోకి బ్యాట్‌ను ఉంచే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు క్రీజు లైన్‌పైనే స్ట్రక్ అయిన బ్యాట్.. పుజారా చేతి నుంచి కూడా బ్యాట్ జారిపోయింది. దాంతో ఉలిక్కిపడిన పుజారా తన కాలును క్రీజులో ఉంచాడు. కానీ అప్పటికే ఆలస్యమవ్వడం.. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పుజారా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అప్పుడూ పోప్‌తోనే..
ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించి క్రీజులో కుదురుకున్న పుజారా.. అప్పుడు కూడా ఇలానే అనూహ్యంగా పెవిలియన్ చేరాడు. డామ్ వేసిన 51వ ఓవర్ నాలుగో బంతికి పుజారా అనూహ్యంగా ఔటయ్యాడు. ఆ బంతిని మిడ్ వికెట్ మీదుగా పుజారా భారీ షాట్‌కు ప్రయత్నించగా.. షార్ట్ లెగ్‌లో ఉన్న పోప్ భుజానికి తగిలి గాల్లోకి లేచి నేరుగా రోరీ బర్న్స్ చేతుల్లోకి వెళ్లింది. ఏ మాత్రం ఊహించని ఈ ఘటనకు పుజారా నిరాశగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 227 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విష యం తెలిసిందే.

ఆదుకున్న కోహ్లీ, అశ్విన్..
సెకండ్ టెస్ట్ మూడో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 54/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. 55 పరుగుల వద్దే పుజారా వికెట్ చేజార్చుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓపెనర్ రోహిత్ శర్మ (26), రిషబ్ పంత్ (8), అజింక్య రహానె (10), అక్షర్ పటేల్(7) వికెట్లను వరుసగా కోల్పోయింది. 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రవిచంద్రన్ అశ్విన్(54 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(60) ఆదుకున్నారు. నిలకడైన ఆటతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 394 పరుగులుగా ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరగులకు ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ 134 పరుగులకే కుప్పకూలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications