Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్‌కు ముందు మహిళల డియోడరెంట్ వాడుతాం: బెన్‌ స్టోక్స్

India vs England: Ben Stokes Says Animated Outbursts Isnt Our Way Of Operating

పుణె: మ్యాచ్‌కు ముందు మహిళల డియోడరెంట్ వాడుతామని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. తనతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా ఉపయోగిస్తారన్నాడు. పురుషుల డియోడరెంట్ కన్నా మహిళలదే వాసన బాగుంటుందని తెలిపాడు. తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో చిత్తయిన ఇంగ్లండ్‌.. నేడు(శుక్రవారం) జరిగే సెకండ్ వన్డేకు సమాయత్తం అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని ఇంగ్లీష్ టీమ్ భావిస్తుండగా, సిరీసే లక్ష్యంగా కోహ్లి సేన బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు బెన్‌ స్టోక్స్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చాడు.

దానిమ్మ ఫ్లేవర్ బాగుంటుంది...

దానిమ్మ ఫ్లేవర్ బాగుంటుంది...

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌కు మహిళల డియోడరెంట్( శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉపయోగించేది) వాడుతానని, పొమోగ్రనేట్ ఫ్లేవర్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. తానొక్కడినే కాదని ఇతర ఆటగాళ్లు కూడా వాడుతారని తెలిపాడు. ఎవరెవరూ వాడుతున్నారని అడగ్గా జట్టు మొత్తం ఉపయోగిస్తుందని చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఇక తొలి వన్డేలో బంతితో మెరిసిన స్టోక్స్.. బ్యాట్‌తో దారుణంగా విఫలమయ్యాడు. సూపర్బ్ బౌలింగ్‌తో మూడు వికెట్లు తీసిన ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్.. బ్యాటింగ్‌లో మాత్రం ఒకే పరుగు చేసి నిరాశపరిచాడు.

వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత..

వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత..

ఇక 2019 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత భారత్‌తోనే స్టోక్స్ ఫస్ట్ వన్డే ఆడాడు. ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు తొలిసారి విశ్వకిరిటాన్ని అందించిన స్టోక్స్.. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వన్డే క్రికెట్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. 'వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ఇదే నా ఫస్ట్ వన్డే కావడం చాలా క్రేజీగా ఉంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ ఫార్మాట్ ఆడటం బాగుంది. జోరూట్ లేకపోవడంతోనే మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాను'అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

రూట్‌కు మెసేజ్ చేశా..

రూట్‌కు మెసేజ్ చేశా..

మూడో స్థానంలో ఎలా ఆడాలని జోరూట్‌కు మేసేజ్ చేస్తే.. 'నీలా నువ్వు ఆడు' అని రూట్ తనకు సమాధానం ఇచ్చాడని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. అయితే రెగ్యులర్‌గా తాను ఆడే 5, 6 స్థానాల్లో కంటే మూడో స్థానంలో ఆడటానికి చాలా తేడా ఉందన్నాడు. ఫినిషర్‌గా సాధారణంగా 60 బంతులు ఆడితే మూడో స్థానంలో వంద వరకు ఎదుర్కోవాల్సి రావొచ్చన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఓపెనింగ్‌ చేసినప్పటికీ ఇంగ్లండ్‌లో ప్రతి స్థానానికి అర్హులైన వారు ఉన్నారని తెలిపాడు. లియామ్‌ లివింగ్‌స్టన్‌కు అవకాశం దొరికితే నిర్భయంగా చెలరేగగలడని తెలిపాడు.

Story first published: Friday, March 26, 2021, 12:23 [IST]
Other articles published on Mar 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+