For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో టెస్టు వల్ల ఐదు కేజీలు బరువు తగ్గా.. జాక్‌ లీచ్‌ అయితే ప్రతీసారి టాయిలెట్‌కు వెళ్లాడు: స్టోక్స్

India vs England: Ben Stokes says I lost 5 kg weight in a week because of 4th Test

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన చివరిదైన నాలుగో టెస్టు కారణంగా ఐదు కేజీలు బరువు తగ్గానని తెలిపాడు. నాలుగో టెస్టు కోసం వారం రోజులు శ్రమించానని, 41 డిగ్రీల సెల్సియస్‌లో ఆడడం వల్లే ఇలా జరిగిందని స్టోక్స్‌ పేర్కొన్నాడు. తాను మాత్రమే కాకుండా జట్టు సభ్యులు అందరూ అనారోగ్యానికి గురయ్యారని ఇంగ్లీష్ ఆల్‌రౌండర్‌ చెప్పుకొచ్చాడు. నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ మరియు 25 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

5 కేజీల బరువు తగ్గా:

5 కేజీల బరువు తగ్గా:

ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ జట్లు టీ20 సిరీస్ కోసం అహ్మదాబాద్‌లోనే సాధన చేస్తున్నాయి. ఈ సందర్భంగా బెన్‌ స్టోక్స్‌ మిర్రర్ స్పోర్ట్‌కు ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. 'ఇంగ్లండ్‌లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు. నాలుగో టెస్టు సందర్భంగా ఎండ వేడిమి కారణంగా నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు అనారోగ్యానికి గురయ్యారు. 41 డిగ్రీల వేడిమిలో ఆడడం వల్లే బహుశా ఇలా జరిగి ఉండొచ్చు. నేను ఒక వారంలోనే 5 కేజీల బరువు తగ్గా. ఇక డోమ్‌ సిబ్లీ 4 కేజీలు, జేమ్స్‌ అండర్సన్‌ 3 కేజీలు బరువు తగ్గిపోయారు. విషయం తెలిసి అందరం షాక్ అయ్యాం' అని స్టోక్స్‌ తెలిపాడు.

టాయిలెట్‌లోనే ఎక్కువగా గడిపాడు:

టాయిలెట్‌లోనే ఎక్కువగా గడిపాడు:

'స్పిన్నర్ జాక్‌ లీచ్‌ అయితే ప్రతీ బౌలింగ్‌ స్సెల్‌ విరామంలో మైదానాన్ని వీడాడు. టాయిలెట్‌కు వెళ్లి అక్కడే ఎక్కువ సమయం గడిపేవాడు. నిజం చెప్పాలంటే.. అతడు మైదానంలో కంటే ఎక్కువ సమయం టాయిలెట్‌లోనే గడిపాడు. అయితే ఇది ఓ సాకు మాత్రం కాదు. ఎలాంటి ఒత్తిడి ఉన్నా మేము జట్టుగా ఆడాల్సిందే. అందుకే అన్ని బాధలు ఓర్చుకొని బరిలోకి దిగాం. ఇక టీమిండియా ఆటగాళ్లకు ఇలాంటి వాతావరణం అలవాటు కావడంతో వాళ్లు తట్టుకొని నిలబడిగలిగారు' అని బెన్‌ స్టోక్స్‌ అన్నాడు.

 వారికి చేదు పర్యటనగా మిగిలిపోయింది:

వారికి చేదు పర్యటనగా మిగిలిపోయింది:

'వేడిమి, ఉక్కపోత తట్టుకుని రిషబ్‌ పంత్, వాషింగ్టన్ సుందర్‌లు బాగా ఆడారు. అందుకే వారి నుంచి మంచి ఇన్నింగ్స్‌లు వచ్చాయి. నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. అందుకే వారు సిరీస్ గెలిచింది. సిరీస్ విజయానికి వారు ముమ్మాటికీ అర్హులు. ఈ సిరీస్‌తో ఎన్నో పాఠాలు నేర్చకున్నాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో మేమింకా మెరుగుపడాల్సి ఉందని తెలుసుకున్నాం. వీటిపై దృష్టి సారించాలి. అయితే యువ క్రికెటర్లు ఓలి పోప్‌, జాక్‌ క్రాలే, డోమ్ సిబ్లీకి ఇదే మొదటి భారత పర్యటన. వారికి ఇది ఒక చేదు పర్యటనగా మిగిలిపోయింది' అని ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు.

టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు:

టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు:

టెస్ట్ సిరీస్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు అందుకుంది. ఫలితంగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్ ‌(డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరగా.. తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 135 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్‌ విజయం లభించింది. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ చెరో‌ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ పనిపట్టారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది.

India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్‌.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'

Story first published: Tuesday, March 9, 2021, 13:22 [IST]
Other articles published on Mar 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+