
అహ్మదాబాద్: టెస్ట్ క్రికెటర్ అనప్పుడు మైదానంలో ఎదురయ్యే ప్రతీ సవాల్‌ను ఎదుర్కోవాల్సిందేనని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. చెన్నై వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్ చెపాక్ పిచ్‌పై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. భారత్ తమకు అనుకూలంగా ఉండే టర్న్ వికెట్‌ను సిద్దం చేసుకుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్.. టెస్టు ఆటగాళ్లు అన్ని పరిస్థితులను ఎదుర్కొవడంలో నైపుణ్యం కలిగి ఉండాలని అభిప్రాయపడ్డాడు. మరోవైపు మూడో టెస్టులో అగ్రశ్రేణి క్రికెటర్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని చెప్పాడు.
'టెస్టు బ్యాట్స్‌మన్‌గా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగేలా ఉండాలి. విదేశీ బ్యాట్స్‌మన్‌గా భారత మైదానాల్లో నిలదొక్కుకోవడం కష్టతరమైనదే. అదే విధంగా మిగిలిన క్రికెటర్లకు ఇంగ్లాండ్ మైదానాలు కఠినంగా అనిపించొచ్చు. అలాంటి ప్రతికూలతలన్నీ ఆటలో భాగమే. అందుకే మేము వాటిని ఆస్వాదిస్తాం'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ జట్లు చెరో విజయం సాధించి సిరీస్‌ను సమం చేశాయి. ఇందులో గెలిచిన టీమిండియా ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఆడే అవకాశాన్ని దక్కించుకుకోవాలని సన్నాహాలు చేస్తోంది. లార్డ్స్ వేదికగా జరగనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే చేరుకుంది. కివీస్‌తో తలపడాలంటే టీమిండియా ఈ సిరీస్‌లో నెగ్గాలి. ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు చేరుకోవాలంటే మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలవాల్సిఉంది. ఒకవేళ ఈ సిరీస్ డ్రాగా ముగిస్తే.. వీరి తర్వాత ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుతుంది.