Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీలా దూకుడుగా ఉండటం మాకు సెట్ కాదు: బెన్‌ స్టోక్స్

India vs England: Ben Stokes Says Animated Outbursts Isnt Our Way Of Operating

పుణె: మైదానంలో దూకుడుగా వ్యహహరించడం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి, అతని జట్టుకు పనిచేస్తుందేమో గానీ తమకు మాత్రం వర్కౌట్ కాదని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. మైదానంలో ఒక్కో జట్టు, ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారని తెలిపాడు. బహుశా అదే వారిని విజయవంతం చేయొచ్చన్నాడు. నాలుగైదేళ్లుగా తమ జట్టుకు పనిచేస్తున్న వ్యూహం మాత్రం అదికాదని వెల్లడించాడు. తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో చిత్తయిన ఇంగ్లండ్‌.. నేడు(శుక్రవారం) జరిగే సెకండ్ వన్డేకు సమాయత్తం అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలని ఇంగ్లీష్ టీమ్ భావిస్తుండగా, సిరీసే లక్ష్యంగా కోహ్లి సేన బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు బెన్‌ స్టోక్స్‌ మీడియాతో మాట్లాడాడు.

కోహ్లీ రన్స్ చేయవద్దు..

కోహ్లీ రన్స్ చేయవద్దు..

'మమ్మల్ని మెరుగైన జట్టుగా మార్చేందుకు అత్యుత్తమైన దారినే మేం ఎంచుకుంటాం. ప్రతి జట్టు తమకు అనువైన దారిలోనే నడుస్తుంది. భారత్‌, ఇంగ్లండ్‌కు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి' అని స్టోక్స్‌ అన్నాడు. కోహ్లీ ప్రశాంతంగా ఉంటే బాగుంటుందా, దూకుడుగా ఉంటే బాగుంటుందా అని అడగ్గా 'వ్యక్తిగతంగా చెప్పాలంటే అతడు పరుగులు చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే అది మా జట్టుకు మంచిది' అని వెల్లడించాడు.

ఆడితే ర్యాంకులు వస్తాయ్..

ఆడితే ర్యాంకులు వస్తాయ్..

వన్డే సిరీస్‌ ఓడితే ఇంగ్లండ్‌ నంబర్‌వన్‌ ర్యాంకు పోయే ప్రమాదముందని ప్రశ్నించగా ''నంబర్‌ 1గా ఉండే అర్హత మా జట్టుకు ఉంది. మేం ఆడిన తీరే మమ్మల్ని ఆ స్థానానికి తీసుకువెళ్లింది. అయితే, ర్యాంకులే ప్రధానం కాదు, ఆటపై దృష్టి సారిస్తే ర్యాంకులు వాటంతటవే మారతాయి. కాబట్టి మా ఫోకస్‌ అంతా మ్యాచ్‌ గెలుపు పైనే ఉంటుంది. అగ్రస్థానంలో ఉండటం ఎవరికైనా ఆనందమే. అయితే అదే మమ్మల్ని నడిపించడం లేదు. ఆట పట్ల మా వైఖరి, మేమెలా ఆడుతున్నామన్నదే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. అదే మమ్మల్ని విజయవంతం చేసింది. నంబర్‌ వన్‌గా మార్చింది'అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

నాలానే ఆడమన్న్ాడు..

నాలానే ఆడమన్న్ాడు..

జో రూట్‌ లేకపోవడంతో మూడో స్థానంలో ఆడుతున్నానని ఇందుకోసం తన ఆటతీరును మార్చుకోలేదని స్టోక్స్‌ పేర్కొన్నాడు. ఆ స్థానంలో ఎలా ఆడాలని ప్రశ్నించగా 'నీలా నువ్వు ఆడు' అని రూట్ తనకు సమాధానం ఇచ్చాడని వెల్లడించాడు. ఫినిషర్‌గా సాధారణంగా 60 బంతులు ఆడితే మూడో స్థానంలో వంద వరకు ఎదుర్కోవాల్సి రావొచ్చన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఓపెనింగ్‌ చేసినప్పటికీ ఇంగ్లండ్‌లో ప్రతి స్థానానికి అర్హులైన వారు ఉన్నారని తెలిపాడు. లియామ్‌ లివింగ్‌స్టన్‌కు అవకాశం దొరికితే నిర్భయంగా చెలరేగగలడని తెలిపాడు.

Story first published: Friday, March 26, 2021, 10:19 [IST]
Other articles published on Mar 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+