చరిత్ర సృష్టించిన ఇండియా X ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. ఆల్‌టైమ్ రికార్డ్!
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీ సరికొత్త చరిత్రను లిఖించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు అనూహ్య రీతిలో ప్రేక్షకాదరణ లభించింది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఈ సిరీస్‌లో అత్యధిక మంది వీక్షించారు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్‌ను డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా అత్యధిక మంది వీక్షించడం ఇదే తొలిసారి.
ఇక ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఓవల్ టెస్ట్ ఆఖరి రోజు ఆటను జియో హాట్‌స్టార్ వేదికగా 1.3 కోట్ల కంకరెన్సీ వ్యూస్ నమోదయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌కు ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రావడం ఇదే తొలిసారి. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఈ సిరీస్ 2-2తో సమంగా నిలిచింది.

ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఆఖరి రోజు వరకు సాగింది. ఆఖరి వరకు విజయం ఎవరిని వరిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తొలి టెస్ట్‌లో 371 పరుగుల లక్షచేధనకు దిగిన ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో టెస్ట్‌లో 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసిన భారత్ 336 పరుగుల తేడాతో గెలుపొందింది. లార్డ్స్ వేదికగా ఉత్కంఠగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యచేధనలో టీమిండియా ఆఖరి వికెట్‌గా సిరాజ్ ఔటవ్వడంతో ఓటమి తప్పలేదు.
నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. జడేజా, సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాకు ఓటమి తప్పించారు. ఆఖరి టెస్ట్ మరింత ఉత్కంఠగా సాగింది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల అవసరం కాగా.. టీమిండియా నాలుగు వికెట్లు తీయాల్సి వచ్చింది. సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు. టీ20 తరహా ఉత్కంఠను తలపించడంతో ఆఖరి రోజు ఆటను చాలా మంది వీక్షించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications