Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఆఖరి టెస్ట్‌కు బ్యాటింగ్ పిచ్.. ఐసీసీ చర్యలు తప్పించుకునేందుకు బీసీసీఐ ప్లాన్!

India vs England: BCCI official says 4th Test pitch will be A Batting Beauty

న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతెరా పిచ్‌పై తీవ్ర దుమారం రేగింది. ఐదు రోజుల ఆటకు సరిపడేలా పిచ్‌ రూపొందించలేదని భారత్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మరోసారి పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే వికెట్‌ను వాడితే ఐసీసీ నుంచి కఠిన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో చివరి టెస్ట్ కోసం బ్యాటింగ్ పిచ్‌ను సిద్ధం చేయాలని భావిస్తోంది.

రిస్క్ తక్కువే కాబట్టి..

రిస్క్ తక్కువే కాబట్టి..

సిరీస్‌లో 2-1తో లీడ్‌లో ఉన్న టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే నాలుగో టెస్ట్‌ను కనీసం డ్రానైనా చేసుకోవాలి. ఒకవేళ ఓటమిపాలైతే లార్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్‌ 18న జరగనున్న ఫైనల్‌కు ఆస్ట్రేలియా అర్హత సాధిస్తుంది. దాంతోనే మార్చి 4 నుంచి మొతేరా వేదికగానే జరిగే ఈ మ్యాచ్ కోసం స్పిన్ వికెట్ గురించి బోర్డు పెద్దలు ఆలోచనే చేయడం లేదని తెలుస్తోంది. పిచ్‌కు సంబంధించినంత వరకూ హోమ్‌టీమ్‌కు చాలా తక్కువ రిస్క్ ఉండేలా చూసుకుంటున్నారని సమాచారం.

 ఇంగ్లండ్ ఫిర్యాదు చేయలేదు..

ఇంగ్లండ్ ఫిర్యాదు చేయలేదు..

'పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. బౌన్స్‌ కూడా లభిస్తుంది. ఒకే వేదికగా రెండు మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఒక టెస్టు ఫలితంతో నిర్ణయానికి రావద్దు. ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం మ్యాచ్‌ రిఫరీ శ్రీనాథ్‌ ఇచ్చిన రిపోర్ట్‌తో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఐసీసీ నిర్ణయిస్తుంది. పిచ్‌పై ఇప్పటివరకు ఇంగ్లండ్ జట్టు ఎలాంటి ఫిర్యాదు కూడా ఇవ్వలేదు'అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

ముందే ఊహించాం..

ముందే ఊహించాం..

''గులాబి టెస్టు బాగానే సాగింది. అయితే ఇంగ్లండ్ మాజీలు పిచ్‌పై బంతి ఎక్కువగా గింగరాలు తిరిగిందని వ్యాఖ్యలు చేశారు. పిచ్‌ వల్లనే ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు. కానీ, నేరుగా వచ్చిన బంతులకే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఔటయ్యారు. బీసీసీఐ వీటిని ముందే ఊహించింది'' అని వెల్లడించారు.

వచ్చే సీజన్ ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు కూడా మొతెరా స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉండడంతో మరోసారి దుమ్మురేపే పొడి పిచ్‌ను సిద్దం చేసి విమర్శల పాలవ్వకూడదని టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

Story first published: Sunday, February 28, 2021, 9:56 [IST]
Other articles published on Feb 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+