అభిమానులకు శుభవార్త.. మొతేరా స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి! ప్రధానికి ఆహ్వానం!

ముంబై: క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం (మొతేరా స్టేడియం)లో జరిగే మూడు, నాలుగో టెస్ట్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. చివరి రెండు టెస్టులకు గాను స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులను అనుమతించే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ మహమ్మారి అనంతరం భారత్‌లో క్రికెట్ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడం ఇదే మొదటిసారి. మూడో టెస్ట్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి కిరెన్ రిజిజుతో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానం పలికాలని బీసీసీఐ యోచిస్తోంది.

చివరి రెండు టెస్టులకు ప్రేక్షకులు:
భారత్‌లో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచే చివరిది. కరోనా కారణంగా దాదాపు 6 నెలలు ఆటలు నిలిచిపోయాయి. ఆపై ఐపీఎల్ 2020 యూఏఈలో జరగ్గా.. ఆస్ట్రేలియా పర్యటన కంగారూ గడ్డపై జరిగింది. భారత్‌లో ఇంగ్లండ్ సిరీస్ త్వరలో జరగనుంది. మొతేరా స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానం. మొతేరా సామర్థ్యం లక్ష్య పదివేలు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 ఆంక్షలను సడలించింది. క్రీడా వేదికల్లోకి 50 శాతం మంది ప్రేక్షకులు అనుమతించవచ్చని చెప్పడంతో.. చివరి రెండు టెస్టులకు 55 వేళ మంది నేరుగా మ్యాచ్ చూసే అవకాశం ఉంది.

మైదానాల్లోకి 50 శాతం మంది:
'కరోనా ఆంక్షలను మరింతగా సడలించిన కేంద్ర ప్రభుత్వం.. మైదానాల్లోకి 50 శాతం మంది వరకు వీక్షకులను అనుమతించ వచ్చని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. మూడు, నాలుగో టెస్ట్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నాం. మొతేరా సీటింగ్ సామర్థ్యం లక్ష కంటే ఎక్కువ కాబట్టి.. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జిసిఏ) 50 శాతం మందిని సులభంగా అనుమతించవచ్చు. మీడియా కూడా స్టేడియం నుంచే మ్యాచును కవర్ చేసుకోవచ్చు' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

రెండో టెస్టుకు ప్రేక్షకులు?:
బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ సంఘాలు తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించరాదని మొదట నిర్ణయించాయి. కానీ ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో పరిస్థితి మారింది. 'ఫిబ్రవరి 5న ఆరంభమయ్యే మొదటి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడానికి సమయం లేదు. ఎందుకంటే శనివారమే మాకు ప్రభుత్వ నోటిఫికేషన్ అందింది. ఇంత తక్కువ సమయంలో ప్రేక్షకుల ప్రవేశానికి ఏర్పాట్లు చేయలేం. రెండో టెస్టుకు మాత్రం ప్రేక్షకులను రానిస్తాం' అని టీఎన్‌సీఏ అధికారి ఒకరు చెప్పారు. చెన్నై చెపాక్ స్టేడియం సామర్థ్యం 50 వేలు.

ఫిబ్రవరి 5 నుంచి మొదటి టెస్టు:
సుదీర్ఘ పర్యటనలో భారత్-ఇంగ్లండ్ జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. 13 నుంచి 17 వరకు చెన్నై వేదికగానే రెండో టెస్ట్ జరగనుంది. ఇక మొతేరా స్టేడియంలో చివరి రెండు టెస్టులు జరగనున్నాయి. ఆపై ఐదు టీ20లు ఇక్కడే జరుగుతాయి. పూణేలో వన్డేలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు చెన్నై లీలా ప్యాలెస్ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నాయి.
ISL 2020-21: చెన్నయిన్ చిత్తు.. ప్లేఆఫ్ దిశగా హైదరాబాద్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications