Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఇండియాకు భారీ షాక్.. తొలి టెస్టుకు కొన్ని నిమిషాల ముందు స్పిన్నర్ ఔట్!!

India vs England: Axar Patel ruled out of first Test with knee injury

చెన్నై: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆరంభానికి కొన్ని నిమిషాల ముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను తొలి టెస్టు నుంచి తొలగిస్తున్నట్లు భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఎడమ మోకాలు నొప్పిగా ఉందంటూ టీం మేనేజ్‌మెంట్‌కు అక్షర్ చెప్పడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అక్షర్‌ను బీసీసీఐ మెడికల్ టీం పూర్తి స్థాయిలో పరీక్షిస్తోందని, అతడికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావలసి ఉందని పేర్కొంది.

అక్షర్ ఔట్

అక్షర్ ఔట్

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈరోజు ఉదయం 9.30 గంటలకి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్‌కి ముందు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయంతో మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఎడమ మోకాలు నొప్పిగా ఉందంటూ టీం మేనేజ్‌మెంట్‌కు అక్షర్ చెప్పడం వల్లనే అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. గురువారం ప్రాక్టీస్ సెషన్‌లో అక్షర్ మోకాలికి గాయమైందని బీసీసీఐ తెలిపింది. అక్షర్ స్థానంలో స్పిన్నర్ షబాజ్ నదీమ్, రాహుల్ చహర్‌ని జట్టులోకి సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు పేర్కొంది.

చివరి నిమిషంలో జట్టులోకి నదీమ్

చివరి నిమిషంలో జట్టులోకి నదీమ్

చెపాక్ పిచ్ స్పిన్నర్లకి అనుకూలమని మొదటి నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో గాయపడిన రవీంద్ర జడేజా లేని లోటుని ఎడమ చేతి వాటం స్పిన్ ఆల్‌రౌండరైన అక్షర్ పటేల్‌తో భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆశించింది. కానీ గాయంతో అక్షర్ కూడా దూరమయ్యాడు. ఇక ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చిన స్పిన్నర్ షబాజ్ నదీమ్‌కి అనూహ్యంగా తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ చోటిచ్చాడు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ నదీమ్‌కి ఇది రెండో టెస్టు మాత్రమే. మరి ఎలా ఆడతాడో చూడాలి.

ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

మరోవైపు తొలి రెండు టెస్టులకు అత్యుత్తమ జట్లను ఎంపికచేయలేదని ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ క్రాలే గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరంకానున్నాడు. 23 ఏళ్ల క్రాలే కుడి మణికట్టుకు గాయం కావడంతో చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు దూరమైనట్లు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. ప్రాక్టీస్‌ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట క్రాలే ఫ్లోర్‌పై జారిపడటంతో అతడి మణికట్టుకు గాయమైంది.

భారత్ తుది జట్టు

భారత్ తుది జట్టు

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, షబాజ్ నదీమ్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా.

అప్పటి నుంచి కోహ్లీ సెంచరీ చేయలేదు! ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాన్స్! మరి 31లోనైనా 71 సాధిస్తాడా?

Story first published: Friday, February 5, 2021, 11:26 [IST]
Other articles published on Feb 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+