India vs England: మళ్లీ చెలరేగిన భారత స్పిన్నర్లు.. ఇంగ్లండ్ 205 ఆలౌట్!

అహ్మదాబాద్: భారత్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/66), రవిచంద్రన్ అశ్విన్(3/47) మరోసారి చెలరేగడంతో ఇంగ్లండ్ 205 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(55), డాన్ లారెన్స్(46) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, అక్షర్‌కు తోడుగా మహ్మద్ సిరాజ్(2/45) రెండు, వాషింగ్టన్ సుందర్(1/14) ఒక వికెట్ తీశాడు. మొతేరా వేదికగానే జరిగిన మూడో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్ట్ ఫ్లాట్ పిచ్ సిద్దం చేసినా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) వికెట్ కోల్పోయింది. జిమ్మీ అండర్సన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులో మరో ఓపెనర్ రోహిత్ శర్మ(5)తో పాటు చతేశ్వర్ పుజారా(0) ఉన్నాడు.

అదరగొట్టిన అక్షర్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అక్షర్ పటేల్ స్పిన్ ధాటికి ఆ జట్టు ఓపెనర్లు డొమినిక్ సిబ్లీ(2), జాక్ క్రాలే(9) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. మూడో టెస్ట్‌లాగే ఇంగ్లండ్‌ను స్పిన్‌తో బెదరగొట్టాలనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యూహం ఫలించింది. అక్షర్ వేసిన 6వ ఓవర్ రెండో బంతికే సిబ్లీ క్లీన్ బోల్డ్ కాగా.. అతని మరుసటి ఓవర్(8వ)లో జాక్ క్రాలే క్యాచ్ ఔటయ్యాడు. పంత్ స్లెడ్జింగ్‌తో విసిగిపోయిన క్రాలే భారీ షాట్‌కు యత్నించి మహ్మద్ సిరాజ్‌కు చిక్కాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జోరూట్(5)ను మహ్మద్ సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో ఇంగ్లండ్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న స్టోక్స్..
ఈ క్లిష్టస్థితిలో ఇంగ్లండ్‌ను బెన్ స్టోక్స్, బెయిర్ స్టో(28) ఆదుకున్నారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. దాంతో ఇంగ్లండ్ 74/3 స్కోర్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విరామం అనంతరం సిరాజ్ విడదీశాడు. అద్భుతమైన బంతితో బెయిర్‌స్టోను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. బెయిర్ స్టో రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఓలి పోప్‌తో స్టోక్స్ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో 114 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో స్టోక్స్ టెస్టుల్లో 24వ అర్ధ శతకం సాధించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న స్టోక్స్‌ను సుందర్ బోల్తా కొట్టించాడు. ఆపై పోప్, లారెన్స్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. దాంతో ఇంగ్లండ్ 144/5 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

చెలరేగిన అశ్విన్..
క్రీజులో కుదురుకుంటున్న ఓలిపోప్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు. పోప్(29) అన్ లక్కీగా షార్ట్ లెగ్‌లో ఉన్న శుభ్‌మన్‌కు చిక్కాడు. బ్యాట్‌కు తగిలిన బంతి అతని కాళ్ల సందులోంచి శుభ్‌మన్ చేతిలో పడింది. దాంతో 6 వికెట్‌కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మరింత జోరు పెంచిన అశ్విన్ బెన్స్ ఫోక్స్(1), జాక్ లీచ్(7)ను ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన డాన్ లారెన్స్‌ను అక్షర్‌ను పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications