Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమితాబ్.. జోరూట్ ఎవరో తెలిసిందా? ఐదేళ్ల ట్వీట్‌‌ను తిరగదోడిన ఫ్లింటాఫ్!

India vs England: Andrew Flintoff Digs Up Amitabh Bachchans Old Tweet After Joe Roots Double Century

న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ (377 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 218) డబుల్ సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే రూట్‌ ద్విశతకమేమో కానీ.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ మధ్య ఐదేళ్లనాటి వివాదం మరోసారి రాజుకుంది. జోరూట్ సూపర్ ఫెర్ఫామెన్స్‌కు ముగ్దుడైన ఫ్లింటాఫ్.. ఐదేళ్ల కిందట అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్‌ను తిరగదోడి బిగ్‌బీపై సెటైర్లు పేల్చాడు.

రూట్‌ను అందుకుంటాడు..

రూట్‌ను అందుకుంటాడు..

2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (51 బంతుల్లో 81 నాటౌట్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌.. బిగ్‌ 'బి' అమితాబ్‌ బచ్చన్‌ మధ్య ట్విటర్‌ వార్‌ జరిగింది. 'ఇలాగే ఆడితే రూట్‌ను విరాట్‌ ఏదో ఒక రోజుకి అందుకొంటాడు' అని అప్పట్లో ఫ్లింటాఫ్‌ ట్వీట్‌ చేశాడు.

 బిగ్‌బీకి గౌరవంతో..

బిగ్‌బీకి గౌరవంతో..

అయితే కోహ్లీ ఘనతలను ఫ్లింటాఫ్ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసాడని భావించిన అమితాబ్.. 'ఎవరా రూట్‌? వేళ్లతో సహా పీకేస్తాం' అని కౌంటర్‌ ఇచ్చాడు. ఇక అవకాశం కోసం కాచుక్కూర్చున్న ఫ్లింటాఫ్‌..రూట్‌ తాజా ప్రదర్శనతో ఇదే అదనుగా రంగంలోకి దిగాడు. అమితాబ్‌ నాటి రిప్లైను ఉదహరిస్తూ.. 'పెద్దాయనకు గౌరవంతో' అంటూ పాత ట్వీట్‌ను తిరగదోడాడు. రూట్ ఎవరో తెలిసిందా? అని బిగ్‌బీని ఫ్లింటాఫ్ పరోక్షంగా ప్రశ్నించాడు.

బిగ్‌బీ ఫ్యాన్స్ ఫైర్..

ఇక ఫ్లింటాఫ్‌పై బిగ్‌బీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక్క డబుల్ సెంచరీకే ఫ్లింటాఫ్ ఎగిరి ఎగిరి పడుతున్నాడని సెటైరిక్‌గా బదులిస్తున్నారు. ఎన్ని జన్మలెత్తిన బిగ్‌బీ సాధించిన ఘనతలను, అభిమానులను సొంతం చేసుకోలేవని ఫ్లింటాఫ్ చురకలంటిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ఫ్లింటాఫ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆటలో ఇలాంటి సహజమేనని, చూసి చూడనట్లు వదిలేయాలని పేర్కొంటున్నారు.

 ఒకే ఒక్కడు..

ఒకే ఒక్కడు..

డబుల్ సెంచరీతో జోరూట్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత గడ్డపై డబుల్ సెంచరీ చేసిన రెండో విదేశీ బ్యాట్స్‌మన్‌‌‌గా నిలిచాడు. 2014లో బ్రెండన్‌ మెకల్లమ్‌ హైదరాబాద్‌లో రూట్ కన్నా ముందు డబుల్ సెంచరీ సాధించాడు. 100వ టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా కూడా ఈ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ గుర్తింపుపొందాడు.

రూట్‌ కెరీర్‌లో ఇది ఐదో డబుల్‌ సెంచరీ. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో కుక్‌ (5)తో సమంగా నిలవగా, అత్యధికంగా వాలీ హామండ్‌ 7 డబుల్‌ సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్‌ తరఫున కుక్‌ (12,472), గూచ్‌ (8,900) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ జాబితాలో ఇప్పుడు రూట్‌ (8,467) మూడో స్థానానికి చేరాడు.

Story first published: Sunday, February 7, 2021, 12:05 [IST]
Other articles published on Feb 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+