Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: చెన్నై టెస్టులో అరుదైన ఘటన.. 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!!

India vs England: After 27 years Two Indian umpires stand in a Test match in India
Ind vs Eng 2021,1st Test : After 27 Years Two Indian Umpires Stand In A Test Match In India

చెన్నై: నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్ మధ్య చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈరోజు తొలి టెస్టు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్‌లో కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్‌ తొలుత బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గు చూపాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ప్రత్యేకత ఘటన కూడా చోటుచేసుకుంది. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో తొలిసారి ఇద్దరు స్వదేశీ అంపైర్లు విధులు నిర్వహిస్తున్నారు.

1994 తర్వాత ఇదే తొలిసారి

1994 తర్వాత ఇదే తొలిసారి

1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో భారత అంపైర్లు ఎల్‌.నరసింహన్‌, వీకే రామస్వామి ఆ మ్యాచ్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇద్దరు స్వదేశీ అంపైర్లు (నితిన్‌ మీనన్‌, అనిల్‌ చౌదరీ) విధులు నిర్వహిస్తున్నారు. భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌కు ఐసీసీ కొద్ది రోజుల క్రితమే నితిన్‌ మీనన్‌, అనిల్‌ చౌదరీ, వీరేందర్‌ శర్మ అనే ముగ్గురు ఐసీసీ ప్యానల్‌ అంపైర్లను నియమించింది. ఈ నేపథ్యంలోనే తొలి టెస్టులో అనిల్‌, నితిన్‌ బరిలోకి దిగారు. ఇక రెండో టెస్టులో వీరేందర్‌.. నితిన్‌కు తోడుగా మరో అంపైర్‌గా వ్యవహరించనున్నారు.

నితిన్ మీన‌నే సీనియ‌ర్

నితిన్ మీన‌నే సీనియ‌ర్

కరోనా వైరస్ కార‌ణంగా ప్ర‌యాణ స‌మ‌స్య‌లు ఉండ‌టంతో వ‌రల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌సిప్‌లో స్థానిక అంపైర్ల‌నే నియ‌మించే అవ‌కాశం ఐసీసీ క‌ల్పించింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ప్యానల్‌ అంపైర్లలో సభ్యులైన అనిల్ చౌద‌రి‌, వీరేందర్ శర్మ‌, నితిన్‌ మీనన్‌లకు ఈ అవకాశం వచ్చింది. మరోవైపు తొలి రెండు టెస్టులకు జవగళ్‌ శ్రీనాథ్‌ మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించనున్నారు. అందరిలో నితిన్ మీన‌నే సీనియ‌ర్‌. అత‌డు మూడు టెస్టులు, 24 వ‌న్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ చేశారు. వీరేంద‌ర్ శ‌ర్మ కేవ‌లం రెండు వ‌న్డేలు, ఒక టీ20లోనే అంపైరింగ్ చేయ‌గా.. చౌద‌రి 20 వ‌న్డేలు, 28 టీ20ల్లో అంపైరింగ్ చేశారు.

నిల‌బ‌డి త‌డ‌బ‌డిన ఇంగ్లండ్

నిల‌బ‌డి త‌డ‌బ‌డిన ఇంగ్లండ్

టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ త‌డ‌బ‌డింది. లంచ్ బ్రేక్ సమయానికి ముందు ఇంగ్లీష్ జట్టు వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 24వ ఓవర్‌లో ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (33)ను ఔట్‌ చేయగా.. 26వ ఓవర్‌లో లారెన్స్ ‌(0)ను జస్ప్రీత్ బుమ్రా డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. దీంతో రూట్ సేన 63 పరుగుల వద్ద రెండు వికెట్లు‌ కోల్పోయింది. క్రీజులో ప్రస్తుతం సిబ్లీ (26), జో రూట్ (4)‌ ఉన్నారు. భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 67 రన్స్ చేసింది.

వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌.. లంచ్ సమయానికి 67/2!

Story first published: Friday, February 5, 2021, 13:06 [IST]
Other articles published on Feb 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+