
బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలి..
మూడో టీ20లో టీమిండియా చేసిన మార్పులు బెడిసికొట్టాయని, టాపార్డర్ దారుణంగా విఫలమైందని చోప్రా గుర్తు చేశాడు. ఈ క్రమంలో నాలుగో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం ఉందన్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న కేఎల్ రాహుల్‌ను నాలుగులో ఆడించాలని, యువ ఆటగాడు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలతో ఇన్నింగ్స్ మొదలుపెట్టించాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌కు చోప్రా సూచించాడు. అంతేగాకుండా గత మ్యాచ్‌లో నాలుగులో వచ్చిన కోహ్లీని ఫస్ట్ డౌన్‌లోనే బ్యాటింగ్‌కు రావాలన్నాడు. రాహుల్ నాలుగో స్థానంలో రావడం వల్ల ఫామ్ అందుకుంటాడని తెలిపాడు.

రాహుల్ 4
'ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం లేదు కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాలి. రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్‌లతో ఇన్నింగ్స్ ప్రారంభించి, రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే ఎలా ఉంటుంది. 2014 ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీని కూడా ధోనీ వెస్టిండీస్ డౌన్‌ది ఆర్డర్‌లో ఆడించాడు. కొన్నిసార్లు చిన్న చిన్న మార్పులు ఫామ్ అందుకోవడానికి ఉపయోగపడుతాయి.'అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఇక 2014లో వెస్డిండీస్‌తో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కోహ్లీ ఏడాది పాటు అలానే ఆడాడు. ఏడాది తర్వాత మళ్లీ మూడో స్థానంలో బరిలోకి దిగడం మొదలు పెట్టాడు.
అండగా ఉండాలి..
ఓ మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైనంత మాత్రాన కేఎల్ రాహుల్ టీమిండియా అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మన్ కాకుండా పోడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. 'అందరు క్రికెటర్లు ఇలాంటి గడ్డు దశను అనుభవిస్తారు. కానీ టీ20 ఫార్మాట్లో రాహుల్ మా అత్యుత్తమ ఆటగాడు. అతని సగటు 40, స్ట్రైక్‌రేట్ 145కు పైగా ఉంది. మూడు సార్లు విఫలమైనంత మాత్రాన అతను అత్యుత్తమ ఆటగాడు కాకుండా పోడు. ఇలాంటి సమయంలోనే మేం అతనికి అండగా ఉండాలి. అతను త్వరగా పుంజుకుంటాడన్న నమ్మకం మాకుంది' అని విక్రమ్ రాథోడ్ అన్నాడు.

రాహుల్ మ్యాచ్ విన్నర్..
వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అండగా నిలిచాడు. అతనో మ్యాచ్ విన్నరని కొనియాడాడు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేందుకు రాహులే సరైనోడు అని స్పష్టం చేశాడు. 'రెండ్రోజుల క్రితం వరకు నేనూ ఫామ్‌లో లేను. కేఎల్ రాహుల్ మ్యాచ్ విన్నర్. జట్టులో అతడో కీలక ఆటగాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. టీ20 ఫార్మాట్‌లో ఫామ్‌లోకి రావడమనేది ఐదారు బంతుల వ్యవహారమే. ఓపెనింగ్ చేసేందుకు రాహులే సరైనోడు' అని కోహ్లీ స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications












