India vs England: తొలి టెస్టుకి భారత జట్టు ఇదే.. సిరాజ్, శార్ధూల్, సైనీలకు దక్కని చోటు!

ముంబై: ఆస్ట్రేలియాపై 2-1తో టెస్ట్ సిరీస్ గెలిచి ఫుల్‌జోష్‌లో ఉన్న భారత జట్టు మరో సమరానికి సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కూడా ఒక్కడే జరగనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక గాయపడిన ఆటగాళ్లు జట్టులోకి రావడంతో తొలి టెస్టు కోసం భారత ప్లేయర్స్ మధ్య పోటీనెలకొంది. అయితే తుది జట్టు ఇదే అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తాజాగా అంచనా వేశాడు. మరి చోప్రా తన జట్టులోకి ఎవరిని తీసుకున్నాడో ఓసారి చూద్దాం.

ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్
ఆకాశ్ చోప్రా తుది జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లకు చోటిచ్చాడు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలను తీసుకున్నాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు ఓటేశాడు. వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌లను జట్టులోకి తీసుకోవడంతో నెం.8 వరకూ బ్యాటింగ్‌ని బలోపేతం చేసుకోవచ్చని టీమిండియా యాజమాన్యంకు హింట్ ఇచ్చాడు. చెపాక్ పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుండటంతో.. కుల్దీప్ యాదవ్‌ని కూడా తుది జట్టులో తీసుకున్నాడు. దీంతో ముగ్గురు స్పిన్నర్లకి తుది జట్టులో చోటిచ్చాడు.

ఇషాంత్, బుమ్రాలకు చోటు
ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా రూపంలో ఇద్దరు పేసర్లకి మాత్రమే ఆకాశ్ చోప్రా తుది జట్టులో అవకాశమిచ్చాడు. గాయాలతో ఆస్ట్రేలియా టూర్ మొత్తానికీ ఇషాంత్ దూరమవగా.. చివరి టెస్టుకి బుమ్రా దూరమయిన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా గడ్డపై ముగిసిన టెస్టు సిరీస్‌లో అంచనాలకి మించి రాణించిన ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, నవదీప్ సైనీలను ఆకాశ్ పక్కనపెట్టాడు. రవీంద్ర జడేజా గాయంతో దూరమవడంతో.. అతని స్థానంలో కుల్దీప్‌కి ఛాన్స్ ఇచ్చాడు.

భారత క్రికెటర్లకు నెగెటివ్
భారత క్రికెటర్లకు గురువారం తొలి రౌండ్ కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఫిబ్రవరి 2న సాధన ఆరంభించడానికి ముందు ఆటగాళ్లు మరో రెండు సార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాల్సివుంటుంది. భారత క్రికెటర్లంతా ఇప్పుడు లీలా ప్యాలేస్ హోటల్లో బయో బబుల్‌లో ఉన్నారు. అయితే క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. సుదీర్ఘ పర్యటనలో ఇరు జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి.

ఆకాశ్ చోప్రా తుది జట్టు
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
పంత్.. ఇంకా మార్చుకోలేదా? చిన్నపిల్లలు చేసే విధంగా ఉంది!