
ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన గబ్బా టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రస్తుతం ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్ 2020, ఆసీస్ పర్యటన నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్న పంత్.. ప్రస్తుతం కుటుంబంతో జాలిగా ఉన్నాడు. అయితే ఫుల్‌జోష్‌లో ఉన్న పంత్‌ను నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇంకా సంతకాన్ని మార్చుకోలేదని సరదాగా ఆటపట్టిస్తున్నారు. విషయంలోకి వెళితే...
ఇటీవల ముగిసిన గబ్బా టెస్టుతో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ తన కెరీర్‌లో ఓ కీలక మైలురాయి చేరుకున్నాడు. గబ్బా టెస్టు లైయన్‌కు వందోది. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆటగాడిగా లైయన్ నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని టీమిండియా ఆటగాళ్లు లైయన్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ బహుమతిని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆటోగ్రాఫ్‌లు చేసిన ఒక జెర్సీని ఆసీస్ స్పిన్నర్‌కు అందజేశారు.
తాజగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారత ఆటగాళ్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటో కాస్త వైరల్ అయింది. అయితే ఆ జెర్సీపై రిషభ్ పంత్ చేసిన సంతకం చిన్నపిల్లలు చేసే విధంగా ఉందని పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. 'పంత్ చిన్నప్పటి నుంచి తన సంతకాన్ని మార్చుకోలేదా?' అని కామెంట్లు పెడుతున్నారు. ఇక తన సంతకం చివరన స్మైలీ ఎమోజీ జతచేయడంతో నెటిజన్లు మీమ్స్‌తో నవ్వుకుంటున్నారు.
తాను ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నానని.. ఇందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని రిషబ్ పంత్ గురువారం అభిమానులను కోరాడు. ఇల్లు ఎక్కడ కొంటే బాగుంటుందో చెప్పండని ట్వీట్ చేశాడు. 'ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చినప్పటి నుంచీ ఇక కొత్త ఇల్లు కొనమని మా ఫ్యామిలీ మెంబెర్స్ వెంట పడుతున్నారు. గుర్గావ్ ఎలా ఉంటుంది? ఇంకా ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి' అని పంత్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ ట్వీట్‌పై అభిమానులు సరదాగా రిప్లై ఇచ్చారు. 'కోట్లా స్టేడియం దగ్గర తీసుకో.. ఐపీఎల్ టైమ్‌లో సులువు అవుతుంది' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఈ ప్రశ్నిను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ట్విటర్‌లో అడిగే ధైర్యం చేయలేరు' అని మరొకరు ట్వీట్ చేశారు.