
కొత్తగా ముగ్గురికి చాన్స్..
ఇందులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన భారత సెలెక్టర్లు.. మనీశ్ పాండే, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్‌పై వేటు వేశారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో సంజు శాంసన్ బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. మనీశ్ పాండేకు గత కొంతకాలంగా అసలు తుది జట్టులోనే అవకాశాలు దక్కడం లేదు. అవకాశాలు ఇవ్వకుండా వేటు వేయడం ఏ మాత్రం సమంజం కాదని చోప్రా అభిప్రాయపడ్డాడు.

అవకాశం ఇవ్వకుండా..
'భారత వన్డే, టీ20 జట్టులో మనీశ్ పాండే రెగ్యులర్ ఆటగాడు. కానీ.. తాజాగా అతనిపై వేటు వేయడం ద్వారా అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంలోకి నెట్టినట్లయింది. గతంలో తుది జట్టులో అతనికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడేమో ఆప్షన్స్ వెతుకుతున్నారు'అని సెలెక్టర్ల తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో 48 పరుగులే చేసిన వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్.. మూల్యం చెల్లించుకున్నాడని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

సంజూపై వేటు..
మధ్యప్రదేశ్‌తో శనివారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో జార్ఖండ్ తరఫున ఆడిన వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్.. 94 బంతుల్లోనే 19 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 173 పరుగులు చేశాడు. దాంతో.. సంజు శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్‌కి టీ20 జట్టులో భారత సెలెక్టర్లు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అలానే ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 480 పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications
