For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: కెప్టెన్‌ జోరూట్, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ! ఐదో టెస్ట్ డ్రీమ్ 11 ఇదే!

India vs England 5th Test Dream11 Prediction: Captain, Vice-Captain, Fantasy Tips And Playing 11

మాంచెస్టర్: ఓవల్‌లో 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చిరస్మరణీయ విజయాన్నందుకున్న భారత జట్టు మరో ఆసక్తికరపోరుకు సిద్దమవుతోంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి జరగనున్న ఆఖరి టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచిన కోహ్లీసేన ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతుంది.

గెలిచినా.. కనీసం డ్రా చేసుకున్న సిరీస్ భారత్ సొంతం అవుతోంది. ఈ క్రమంలోనే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సమాయత్తమవుతోంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. దాంతో ఆఖరి పోరు కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. ఇక ఈ ఐదో టెస్ట్ డ్రీమ్ 11పై ఓ లుక్కెద్దాం.

ఇంగ్లండ్ టీమ్ న్యూస్..

ఇంగ్లండ్ టీమ్ న్యూస్..

కీలకమైన ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టులో మార్పులు జరగనున్నాయి. సతీమణి ప్రసవం కోసం లీవ్ తీసుకున్న జోస్ బట్లర్ జట్టుతో కలిసాడు. అతను బరిలోకి దిగడం ఖాయం. ఎక్స్‌ట్రా స్పిన్నర్ జాక్ లిచ్‌ కూడా జట్టులో చేరాడు. జోస్ బట్లర్‌ స్థానంలో జట్టుతో కలిసి సామ్ బిల్లింగ్స్ ఉద్వాసనకు గురయ్యాడు. జాక్ లిచ్ అందుబాటులోకి రావడంతో వరుసగా విఫలమవుతున్న మొయిన్ అలీపై వేటుపడనుంది.

ఇక జానీ బెయిర్ స్టో ఫామ్ కూడా ఇంగ్లండ్‌ను కలవరపెడుతుంది. అతన్ని కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌గా మంచి పేరున్న ఓలి రాబిన్‌సన్‌ బ్యాటింగ్ విభాగంలో విఫలమవుతున్నాడు. బంతితో వికెట్లు తీస్తున్నా.. బ్యాట్‌తో పరుగులు సాధించలేకపోతున్నాడు. దాంతో రాబిన్‌సన్‌ నుంచి ఇంగ్లండ్ భారీ ఇనింగ్స్ ఆశిస్తోంది. ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ వికెట్లు తీస్తున్నాడు.

క్రిస్‌ వోక్స్‌ అదరగొడుతున్నాడు. వీరితో పాటు ఓలీ రాబిన్సన్ పర్వాలేదనిపిస్తున్నా.. క్రెయిగ్ ఓవర్టన్ విఫలమవుతున్నాడు. దాంతో అతడి స్థానంలో మార్క్‌ వుడ్ ఆడనున్నాడు. లేదా సామ్ కరన్ కూడా ఆడే అవకాశం ఉంది. కరన్ బ్యాటింగ్ కూడా చేయగలడు.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)

రోరీ బర్న్స్, హసీబ్​ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), ఓలీ పోప్, జోస్ బట్లర్ (కీపర్), జాక్ లీచ్, సామ్ కరన్/మార్క్‌ వుడ్, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్.

భారత టీమ్ న్యూస్..

భారత టీమ్ న్యూస్..

భారత జట్టులో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. గాయంతో నాలుగో టెస్ట్‌కు దూరమైన మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధించాడు. టీమ్ సెలెక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు. దాంతో అతను ఆఖరి టెస్ట్ ఆడటం ఖాయం. అయితే వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రాల్లో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. సిరాజ్‌నే పక్కనపెట్టే అవకాశాలున్నాయి. ఇక వరుసగా విఫలమవుతున్న అజింక్యా రహానేను సైతం పక్కనపెట్టవచ్చు. గత మ్యాచ్‌లో చీలమండ గాయానికి గురైన చతేశ్వర్ పుజారా కోలుకోగా.. మోకాలి గాయానికి గురైన రోహిత్ శర్మ‌కు క్లారిటీ లేదు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే అతను చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతాడు. లేకుంటే పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లో ఒకరు తుది జట్టులోకి వస్తారు. రహానేను పక్కనపెడితే సూర్య అరంగేట్రం చేయడం ఖాయం.

భారత తుది జట్టు(అంచనా)

భారత తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ/పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే/సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా/రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ/ సిరాజ్

డ్రీమ్ 11 ఫాంటసీ టిప్స్

డ్రీమ్ 11 ఫాంటసీ టిప్స్

వికెట్ కీపర్: రిషభ్ పంత్, జోస్ బట్లర్

బ్యాట్స్‌మన్: జోరూట్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ

ఆల్‌రౌండర్స్: రవీంద్ర జడేజా, క్రిస్ వోక్స్

బౌలర్లు: జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా

కెప్టెన్: జోరూట్, వైస్ కెప్టెన్: విరాట్ కోహ్లీ

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్: రిషభ్ పంత్(కీపర్), జోరూట్(కెప్టెన్), విరాట్ కోహ్లీ(వైస్‌ కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ మలాన్, రవిచంద్రన్ అశ్విన్, మోయిన్ అలీ, మహమ్మద్ షమీ, జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Thursday, September 9, 2021, 18:11 [IST]
Other articles published on Sep 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+