For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఓటమి నుంచి భారత్‌ను గట్టెక్కించేది ఆ ఒక్కటే!

India vs England 5th Test Day 5 Weather Report: Will Rain Save Indian Teams Defeat

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్టులో తొలి మూడు రోజులు చక్కటి ప్రదర్శనతో సిరీస్‌ విజయం దిశగా వడి వడిగా అడుగులేసిన భారత్‌.. మ్యాచ్‌లో అనూహ్యంగా వెనుకబడింది. ఇంగ్లీష్‌ జట్టు ముందు 378 పరుగుల భారీ లక్ష్యం నిలిపినప్పటికీ.. భారత్‌కు గెలుపు కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. జో రూట్‌ ( 112 బంతుల్లో 9 ఫోర్లతో 76 బ్యాటింగ్‌), జానీ బెయిర్‌స్టో (87 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 72 బ్యాటింగ్‌) అద్భుత పోరాటంతో ఆతిథ్య జట్టు విజయం వైపు పరుగులు పెడుతోంది. 7 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్‌.. చివరి రోజు విజయానికి ఇంకో 119 పరుగులు చేయాలి.

వరుణుడి మీదే దయ..

వరుణుడి మీదే దయ..

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు ఇది పెద్ద కష్టమేమి కాదు. క్రీజులో సెట్ అయిన జోరూట్, బెయిర్ స్టో ఉండగా.. వికెట్ పూర్తిగా ఫ్లాట్‌గా మారి బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్ బెస్ట్ బౌలర్లు కూడా ఏం చేయలేరు. అయితే భారత్‌ ఓటమి నుంచి గట్టెక్కాలంటే మాత్రం వరుణుడు కరుణించాలి. భారీ వర్షంతో చివరి రోజు ఆట పూర్తిగా తుడుచుకుపెట్టుకోపోవాలి. అప్పుడు మ్యాచ్ డ్రా అయి సిరీస్ 2-1తో భారత్ వశం అవుతోంది. లేదంటే తొలి మూడు రోజులు ఆటంకం కలిగించినట్లు వచ్చి పోతూ ఉండాలి.

వర్షం వచ్చి పోయినా..

వర్షం వచ్చి పోయినా..

అప్పుడు వికెట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. వాతావరణం చల్లగా మారి బంతి స్వింగ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం దిగ్గజ బ్యాటర్ల వల్ల కూడా సాధ్యం కాదు. అప్పుడు భారత బౌలర్లు చెలరేగి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేస్తే విజయం భారత్ సొంతమవుతోంది. ప్రస్తుతం టీమిండియా ముందున్న ఏకైక మార్గం ఇదొక్కటే. అయితే టీమిండియా దరిద్రమో లేక ఇంగ్లండ్ అదృష్టమో తెలియదు కానీ..తొలి మూడు రోజుల పాటు అంతరాయం కలిగించిన వర్షం నాలుగో రోజు జాడలేకుండా పోయింది.

వర్ష సూచన లేదు..

వర్ష సూచన లేదు..

ఐదో రోజు కూడా వర్షం వచ్చే సూచనలు లేవు. అక్కడి వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఈ రోజు ఎలాంటి వర్ష సూచనలేదు. అంతేకాకుండా ఎండ బాగా కొట్టనుంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇది భారత అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది.

సంక్షిప్త స్కోర్లు..

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్(రిషభ్ పంత్ 146, రవీంద్రజడేజా 104, జేమ్స్ అండర్సన్ 5/60)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్(జానీ బెయిర్ స్టో 106, సామ్ బిల్లింగ్స్ 36, మహమ్మద్ సిరాజ్ 4/66)

భారత్ రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్( పుజారా 66, రిషభ్ పంత్ 57, బెన్ స్టోక్స్ 4/33)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 57 ఓవర్లలో 259/3 (బెయిర్ స్టో 72 బ్యాటింగ్, జోరూట్ 76 బ్యాటింగ్)

Story first published: Tuesday, July 5, 2022, 10:34 [IST]
Other articles published on Jul 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+