IND vs ENG: కెప్టెన్ జోరూట్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ! నాలుగో టెస్ట్ డ్రీమ్ 11 ఇదే!

ఓవల్: ఇంగ్లండ్ గడ్డపై మరో ఆసక్తికర పోరుకు టీమిండియా సిద్దమవుతోంది. లీడ్స్ వేదికగా ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కోహ్లీసేన.. ఈ దారుణ పరాభావానికి ప్రతీకారం తీర్చేందుకు సమాయత్తం అవుతోంది. మరోవైపు లార్డ్స్ టెస్ట్‌లో ఎదురైన ఓటమికి లీడ్స్ టెస్ట్‌లో రెండింతల ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.
అదే జోరును కొనసాగించి సిరీస్‌లో పై చేయి సాధించాలని భావిస్తోంది. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌తో భారత బ్యాట్స్‌మన్ ఉక్కిరి బిక్కిరి చేసిన ఇంగ్లండ్ పేసర్లు.. మళ్లీ అదే వ్యూహంతో కోహ్లీసేన కొంపముంచాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో టెస్ట్ పోరు కూడా హోరాహోరీగా జరగనుంది. అభిమానులకు కావాల్సిన మాజా లభించనుంది. ఇక నాలుగో టెస్ట్ డ్రీమ్ 11 టీమ్‌పై ఓ లుక్కెద్దాం.

ఇంగ్లండ్ టీమ్ న్యూస్..
మూడో టెస్ట్‌కు ముందు జట్టులో కీలక మార్పులు చేసిన రూట్ సేన ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. డేవిడ్ మలాన్ రాకతో ఆ జట్టు బ్యాటింగ్ బలం పెరిగింది. ఇక నాలుగో టెస్ట్‌కు సంబంధించిన టీమ్‌ను కూడా ప్రకటించింది. గాయంతో మూడో టెస్ట్‌కు దూరమైన క్రిస్ వోక్స్ నాలుగో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఇక వికెట్ కీపర్ జోస్ బట్లర్ తన రెండో బిడ్డ కోసం సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
అతని సతీమణి ప్రెగ్నెంట్ కావడంతో ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండేందుకు విశ్రాంతి తీసుకున్నాడు. దాంతో జానీ బెయిర్ స్టో కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఇక బట్లర్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చాడు. ఓవల్ పిచ్‌లో అండర్సన్‌కు సరైన రికార్డు లేదు. దాంతో అతనికి నాలుగో టెస్ట్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లండ్ తుది జట్టు
రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జోరూట్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లారెన్స్/ఓలీ పోప్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రైగ్ ఓవర్టన్, సకీబ్ మహమూద్/క్రిస్ వోక్స్, జేమ్స్ అండర్సన్

భారత జట్టు న్యూస్
గత మూడు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో టెస్ట్ బరిలోకి దిగే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా గాయపడటంతో పాటు అశ్విన్‌కు మార్గం సుగుమమైంది. పైగా బంతితో జడేజా రాణించిందేం లేదు. ఇక అదనపు బ్యాట్స్‌మన్ తీసుకోవాలని టీమిండియా భావిస్తే ఇషాంత్ శర్మపై వేటు పడనుంది. అతని స్థానంలో హనుమ విహారీ/ సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరికి అవకాశం దక్కనుంది. అలా కాకుండా నలుగురు పేసర్లతో బరిలోకి దిగినా ఇషాంత్ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగవచ్చు. గత మ్యాచ్‌లో ఇషాంత్ దారుణంగా విఫలమయ్యాడు.

భారత్ తుది జట్టు
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ/శార్దూల్ ఠాకూర్

డ్రీమ్ 11 ఫాంటసీ టిప్స్
వికెట్ కీపర్: రిషభ్ పంత్, జానీ బెయిర్ స్టో
బ్యాట్స్‌మన్: జోరూట్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ
ఆల్‌రౌండర్స్: రవిచంద్రన్ అశ్విన్, మోయిన్ అలీ
బౌలర్లు: జేమ్స్ అండర్సన్, సకీబ్ మహమూద్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా
కెప్టెన్: జోరూట్, వైస్ కెప్టెన్: రోహిత్ శర్మ

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్
మైఖేల్ డ్రీమ్ 11 టీమ్: జానీ బెయిర్ స్టో(కీపర్), జోరూట్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, మోయిన్ అలీ, మహమ్మద్ షమీ, జేమ్స్ అండర్సన్, సకీబ్ మహమూద్, జస్‌ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications