Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: టాస్ ఓడిన టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

IND vs ENG: భారత్ , ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న డిసైడింగ్ వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ ఉత్కంఠభరిత పోరులో లార్డ్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో బోర్డుపై భారీ స్కోరును ఉంచి భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. 3 మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్రతిష్టాత్మకమైన వన్డే సిరీస్ ట్రోఫీని ముద్దాడుతుంది.

భారత్-ఇంగ్లాండ్ మూడో వన్డే టైమింగ్ మార్పు: మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?

భారత్-ఇంగ్లాండ్ మూడో వన్డే టైమింగ్ మార్పు: మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే?

ఈ డూ ఆర్ డై పోరు కోసం భారత జట్టు యాజమాన్యం ప్లేయింగ్ 11లో మూడు కీలక మార్పులు చేసింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగిరాగా.. యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్, లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు తుది జట్టులో స్థానం లభించింది. మరోవైపు గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ కీలక మ్యాచ్ కు దూరమయ్యాడు. మొదటి వన్డే భారత్ విజయం సాధించగా.. రెండో వన్డేలో ఇంగ్లాండ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నిర్ణయాత్మక పోరులో తప్పులను సరిదిద్దుకుని మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

India vs England 3rd ODI England Opt to Bat Jasprit Bumrah Ruled Out of Series Decider at Lords

లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడిపోవడంపై భారత కెప్టెన్ గిల్ స్పందించాడు. టాస్ గెలిచినా తాము ముందుగా బౌలింగే ఎంచుకునేవాళ్లమని గిల్ పేర్కొన్నాడు. అయితే ఈ కీలక మ్యాచ్ కు స్టార్ పేస్ బుమ్రు మోకాలి గాయం కారణంగా దూరమైనట్లు వెల్లడించాడు. బుమ్రాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా గాయం బారిన పడగా.. శివమ్ దూబేను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. వీరిస్థానాల్లో కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్ లు జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.

IND vs ZIM: గంభీర్‌కు బిగ్ షాక్.. జింబాబ్వే పర్యటన నుంచి ఔట్.. కొత్త కోచ్ ఎవరంటే?

IND vs ZIM: గంభీర్‌కు బిగ్ షాక్.. జింబాబ్వే పర్యటన నుంచి ఔట్.. కొత్త కోచ్ ఎవరంటే?

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంతోషం వ్యక్తం చేశాడు. లార్డ్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపిస్తోందని.. బోర్డుపై భారీ స్కోరు ఉంచి భారత్ ను ఒత్తిడిలోకి నెట్టడమే తమ ప్లాన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ జట్టులో సాకిబ్ స్థానంలో జోష్ టంగ్ వచ్చినట్లు వెల్లడించాడు.

తుది జట్లు ఇవే:
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంగ్లండ్ జట్టు: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.

Story first published: Sunday, July 19, 2026, 15:35 [IST]
Other articles published on Jul 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+