Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: రెండో టీ20లో కోహ్లీసేన గెలవాలంటే ఈ మూడు మార్పులు జరగాల్సిందే!

India vs England: 3 Changes India should make to get back to winning ways in 2nd T20I

అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో టీమిండియా తొలి అడుగే తడబడింది. ఇంగ్లండ్ ఐదు టీ20ల సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్‌ పిచ్‌పై టెస్టు విజయాలందుకున్న భారత్‌ టీ20 ఫార్మాట్‌లో కూడా స్పిన్‌ ఉచ్చునే బిగిద్దామనుకుంది. ఏకంగా తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించింది. జట్టు కూర్పుపై... ప్రత్యేకించి స్పిన్‌ బౌలింగ్‌పై కనబరిచిన శ్రద్ధ బ్యాటింగ్‌పై మరచినట్లుంది. అందుకే టీమిండియా టాపార్డర్‌ వికెట్లను నిర్లక్ష్యంగా పడేసుకొని భారీ మూల్యమే చెల్లించుకుంది. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు మాత్రం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో శుభారంభం చేసి ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇదే వేదికగా జరిగే రెండో టీ20 భారత్ గెలవాలంటే తుది జట్టులో మార్పులు అనివార్యం. అవెంటో తెలుసుకుందాం.

రోహిత్ శర్మ రావాల్సిందే..

రోహిత్ శర్మ రావాల్సిందే..

తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణం టాపార్డర్ వైఫల్యం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ నిర్లక్షంగా ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. అయినా ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ చేసిన తప్పిదమే భారత్ టీ20 సిరీస్‌లో చేస్తుందని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు బహిరంగంగానే విమర్శించారు. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగానే రోహిత్‌కు విశ్రాంతినిచ్చామని కోహ్లీ చెప్పుకొచ్చినా.. తొలి మూడు మ్యాచ్‌లు గెలిచి చివరి రెండు మ్యాచ్‌ల్లో ప్రయోగాలు చేయవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారు. సెకండ్ టీ20లో రాహుల్‌కు జతగా రోహిత్ రావాల్సిందేనని పట్టుబడుతున్నారు.

గణంకాలు కూడా..

గణంకాలు కూడా..

ఇక గణంకాలు కూడా ధావన్- రాహుల్ కన్నా రోహిత్- రాహుల్ జోడీవే బాగున్నాయి. టీ20 క్రికెట్‌లో రోహిత్- రాహుల్ ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్‌లు ప్రారంభించగా 50.71 సగటుతో 558 పరుగులు చేశారు. మరోవైపు రాహుల్-ధావన్ మాత్రం 8 ఇన్నింగ్స్‌ల్లో 308 రన్సే చేశారు. టీ20 క్రికెట్‌లో ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ చేయాలన్నా.. భారీ లక్ష్యాన్ని చేధించాలన్నా ఓపెనర్ల పాత్ర చాలా కీలకం. కాబట్టి రోహిత్‌ను వెంటనే జట్టులోకి తీసుకు రావాలని కోహ్లీకి విశ్లేషకులు సూచిస్తున్నారు. గురువారం ప్రెస్‌మీట్‌లో రోహిత్‌కు జతగా రాహుల్ దిగుతాడని చెప్పిన కోహ్లీ.. మ్యాచ్ రోజు మాత్రం అతన్ని పక్కని పెట్టి ధావన్‌ను బరిలోకి దించాడు. పైగా రోహిత్‌కు తొలి రెండు టీ20లకు విశ్రాంతి ఇచ్చామని చెప్పడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. రోహిత్ తుది జట్టులోకి వస్తేనే వరల్డ్ నెంబర్ వన్ అయిన ఇంగ్లండ్‌ను భారత్ నిలువరించగలదు.

చాహల్‌ ప్లేస్‌లో చాహర్..

చాహల్‌ ప్లేస్‌లో చాహర్..

ఇక ఫస్ట్ టీ20లో దారుణంగా విఫలమైన యుజ్వేంద్ర చాహల్‌ను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ జట్టులో లెగ్ స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోనే ఆటగాళ్లున్నారని, అతని ప్లేస్‌లో రాహుల్ చాహర్‌ను తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన చాహల్ ఓ వికెట్ తీసి 44 పరుగులు ఇచ్చుకున్నాడు. భారత బౌలర్లలో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్‌లో కూడా చాహల్ అంతగా రాణించిందేం లేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. చాహర్ మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఐదు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు.

దీపక్ చాహర్ రావాలి..

దీపక్ చాహర్ రావాలి..

ఇక పవర్‌ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే జట్టులోకి దీపక్ చాహర్‌ను తీసుకోవాలి. ప్రధాన పేసర్ గైర్హాజరీలో ఎప్పుడైన దీపక్ చాహర్‌కే అవకాశం దక్కేది. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న శార్దూల్ ఠాకుర్‌కు అవకాశం ఇచ్చారు. కానీ అతను బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం పూర్తి కోటాలో కూడా బౌలింగ్ చేయలేకపోయాడు. 2 ఓవర్లు మాత్రమే వేసి 16 పరుగులిచ్చుకున్నాడు. పవర్ ప్లేలో భారత్‌ను ఇంగ్లండ్ దెబ్బతీసినట్లు(20/3) రాణించాలంటే జట్టులోకి దీపక్ చాహర్ రావాల్సిందే. అతను పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. తన 63 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో(ఐపీఎల్‌తో సహా) దీపక్ చాహర్ 43 వికెట్లు పవర్ ప్లేలోనే పడగొట్టగా.. శార్దూల్ మాత్రం 52 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 17 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ లెక్కన దీపక్ జట్టులోకి రావడం చాలా ముఖ్యం.

Story first published: Saturday, March 13, 2021, 16:41 [IST]
Other articles published on Mar 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+