Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X ఇంగ్లండ్ రెండో టీ20కి అడ్డంకి!

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శనివారం రాత్రి రెండో టీ20 జరగనుంది. ఐర్లాండ్‌తో సిరీస్ పరాజయం అనంతరం ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత తొలి సిరీస్ ఆడుతోంది. హోమ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకొని రెండో టీ20లో గెలవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. మరోవైపు టీమిండియా టినేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

India vs England 2nd T20I Weather and Pitch Report Will Overcast Manchester Skies Threaten Another Washout

మ్యాచ్‌కు వర్ష సూచన

సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తుండగా.. టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం సీనియర్ ఆటగాళ్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అతని అరంగేట్రాన్ని ఆలస్యం చేస్తోంది. మరోవైపు మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి వైభవ్ సూర్యవంశీని ఆడించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

IND Vs ENG: వైభవ్ కోసం సంజూ‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం

IND Vs ENG: వైభవ్ కోసం సంజూ‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం

అయితే తొలి టీ20 తరహాలోనే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే శనివారం మాంచెస్టర్‌లో వర్షం పడే అవకాశం ఉందని అక్యూ వెదర్ పేర్కొంది. వాతావరణం మేఘావృతమై.. చల్లని గాలులు వీయనున్నాయి. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనున్నాయి. మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. తుడిచిపెట్టుకుపోయే అవకాశాలను కొట్టి పారేయలేం.

పిచ్ రిపోర్ట్..

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియం పిచ్ పేస్‌ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో బంతి స్వింగ్ అవ్వనుంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ బంతి టర్న్ అయ్యి స్పిన్నర్లకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. బ్యాటర్లు క్రీజులో సెట్ అయి కాస్త సమయం తీసుకుంటే భారీ స్కోర్లు చేయగలరు. కానీ కొత్త బ్యాటర్లకు నేరుగా దూకుడైన షాట్స్ ఆడేందుకు, బౌండరీలు బాదేందుకు కష్టంగా ఉంటుంది.

బుడ్డోడి క్రేజ్.. బీసీసీఐపై నెటిజన్ల ఫైర్!

బుడ్డోడి క్రేజ్.. బీసీసీఐపై నెటిజన్ల ఫైర్!

తుది జట్లు(అంచనా)

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.

ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరణ్, లియమ్, ఆదిల్ రషీద్ జోఫ్రా ఆర్చర్, సకీబ్ మహమ్మూద్

Story first published: Friday, July 3, 2026, 16:41 [IST]
Other articles published on Jul 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+