For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌తో‌ రెండో టీ20.. భారత ఓపెనింగ్ జోడీలో మార్పు! స్పిన్నర్‌పై వేటు.. మూడో పేసర్‌కి చోటు! తుది జట్లు ఇవే!

India vs England, 2nd T20I Preview: Rohit Sharma and Deepak Chahar likely to play 2nd T20I

అహ్మదాబాద్‌: బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమై తొలి టీ20లో దెబ్బతిన్న టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పుంజుకోవాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌ ఓటమితో తక్కువ అంచనా వేయవద్దని ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ల్లో నిరూపించిన కోహ్లీసేన.. ప్రస్తుత టీ20 సిరీస్‌లోనూ అదే విధంగా పోరాట పటిమతో దూసుకు రావాలని పట్టుదలగా ఉంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని దూకుడైన బ్యాటింగ్‌తో పాటు జట్టులో ప్రయోగాలు చేయాలని విరాట్‌ కోహ్లీ భావిస్తున్నాడు.

ఓపెనింగ్ జోడీలో మార్పు

ఓపెనింగ్ జోడీలో మార్పు

తొలి మ్యాచ్‌లో భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్‌ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. విఫలమైన ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లో ఒకరిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. రెండు టీ20లకి ఓపెనర్ రోహిత్ శర్మకి రెస్ట్ ఇచ్చామని ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినా.. తొలి టీ20 ఓటమితో టీమిండియా మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దాంతో ధావన్‌పై వేటువేసి రోహిత్‌ని ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌ అత్యవసరంగా పుంజుకోవాల్సిన స్థితిలో రోహిత్‌కు సిరీస్‌లో తర్వాత ఓ మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చి.. రెండో టీ20లో ఆడిస్తారేమో చూడాలి.

కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌ బాకీ

కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌ బాకీ

ఇటీవల స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న విరాట్‌ కోహ్లీ మళ్లీ భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచులో శ్రేయస్‌ అయ్యర్‌ నిలవకుంటే భారత్‌ ఇంకా ఘోర పరాభవాన్ని రుచి చూడాల్సి వచ్చేది. రిషబ్ పంత్‌, హార్దిక్ పాండ్యా మంచి ఊపుమీద కనిపించారు కానీ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. రెండో మ్యాచులో పంత్‌, పాండ్యా బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లకు ఈ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.

మూడో పేసర్‌కి చోటు

మూడో పేసర్‌కి చోటు

భారత బౌలింగ్‌ సైతం స్థాయికి తగ్గట్లుగా సాగలేదు. ప్రధాన ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ నిరాశ పరిచాడు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్..‌ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఫస్ట్ టీ20‌లో పిచ్ పేసర్లకి అనుకూలించిన నేపథ్యంలో స్పిన్నర్లలో వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్‌లో ఒకరిని తప్పించి.. ఫాస్ట్ బౌలర్ దీపక్ చహర్‌ని ఆడించబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా రెండో మ్యాచులో భారత్ అన్ని విధాలుగా పుంజుకుంటేనే భారత్ విజయం సాధిస్తుంది.

పదో నంబర్‌ వరకు బ్యాటింగ్

పదో నంబర్‌ వరకు బ్యాటింగ్

ఇయాన్‌ మోర్గాన్, బెన్‌ స్టోక్స్‌లాంటి హిట్టర్లు బరిలోకి దిగాల్సిన అవసరం రాకుండానే తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ ముగించగలిగింది. వారి తుది జట్టును చూస్తే ఒక్క ఆదిల్‌ రషీద్‌ మినహా పదో నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగలరు. ఈ మ్యాచ్‌లోనూ దాదాపు అదే టీమ్‌కు అవకాశం ఉంది. అయితే పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా కనిపిస్తే స్యామ్‌ కరన్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకి అవకాశం ఇవ్వాలని ఇంగ్లండ్‌ యోచిస్తోంది. ప్రధాన స్పిన్నర్‌ రషీద్‌ కూడా గత మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు.

పిచ్, వాతావరణం

పిచ్, వాతావరణం

మొతేరాలో 11 పిచ్‌లు అందుబాటులో ఉన్నాయి. గత మ్యాచ్‌ అనుభవాన్ని బట్టి చూస్తే పేస్, బౌన్స్‌ కాస్త తక్కువగా ఉండి స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్‌ నిలబడితే పరుగులు రావడం కష్టం కాదు. వర్ష సూచన లేదు.

తుది జట్లు:

తుది జట్లు:

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), ధావన్‌/రోహిత్‌, రాహుల్, పంత్, అయ్యర్, పాండ్యా, శార్దుల్, సుందర్‌/సైనీ, అక్షర్, భువనేశ్వర్, చహల్‌.

ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, కరన్‌/అలీ, ఆర్చర్, జోర్డాన్, రషీద్, వుడ్‌.

22 బంతుల్లో యువరాజ్‌ హాఫ్ సెంచరీ.. సచిన్ ధనాధన్‌ ఇన్నింగ్స్‌! దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం!

Story first published: Sunday, March 14, 2021, 12:24 [IST]
Other articles published on Mar 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+