Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG రెండో టీ20కి వర్షం ముప్పు? పిచ్ రిపోర్ట్ ఏంటంటే..?

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. చెన్నై వేదికగా శనివారం జరిగే రెండో టీ20లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 43 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం.

ఇదే జోరులో చెన్నై వేదికగా జరిగే రెండో టీ20లోనూ విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి టీ20 ఓటమి తప్పిదాల నుంచి తేరుకొని విజయం సాధించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా తొలి టీ20 ఏకపక్షంగా సాగగా.. కనీసం రెండో టీ20 అయినా హోరాహోరీగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

India vs England 2nd T20I Pitch Report and Chennai Weather Forecast

షమీ ఇన్.. నితీష్ ఔట్!
ఇక 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీకి తొలి టీ20 తుది జట్టు దక్కలేదు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించడం కోసమే షమీని పక్కనపెట్టారు. అయితే చెన్నై వేదికగా జరిగే రెండో టీ20లో అతన్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి. కొత్త బంతితో హార్దిక్ పాండ్యా విఫలమవడంతో షమీని ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో చెన్నై లోకల్ భాయ్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో ఇంగ్లండ్
తొలి టీ20లో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్‌ రెండో మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. గస్ అట్కిన్సన్ స్థానంలో రెహాన్ అహ్మద్ బరిలోకి దిగవచ్చు.

పిచ్ రిపోర్ట్:
చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా నెమ్మదిగా ఉంటుంది. అయితే ఐపీఎల్ 2024 సీజన్‌ ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించింది. రేపటి మ్యాచ్‌లో కూడా పిచ్ బ్యాటర్లతో పాటు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

వర్షం ముప్పు..?
ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. శనివారం చెన్నై‌లో వాతావరణం పొడిగా ఉండనుంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కానుంది.

తుది జట్లు(అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ.

ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, జాకోబ్ బెతెల్, జామీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Story first published: Friday, January 24, 2025, 19:01 [IST]
Other articles published on Jan 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+