
వర్ష గండం ఉందా?
అయితే ఇంగ్లండ్‌లో వాతావరణం ఎప్పుడూ ఎలా ఉంటుందో చెప్పలేం. రిషెడ్యూల్ టెస్ట్‌కు వరుసగా మూడు రోజులు అంతరాయం కలిగించిన వరుణుడు ఆ తర్వాత ఇబ్బంది పెట్టలేదు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు తొలి వన్డే సైతం సజావుగా సాగింది. అలానే రెండో వన్డేకు కూడా వర్ష సూచన లేదని లార్డ్స్ వాతావరణ శాఖ పేర్కొంది. లార్డ్స్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. అక్కడ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదుకానున్నాయి. గరిష్టంగా 24 డిగ్రీలు.. కనిష్టంగా 16 డిగ్రిల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆకాశాన్ని మబ్బులు కమ్మేసే అవకాశం ఉన్నా.. వర్షం వచ్చే సూచన అయితే లేదు. ఉదయం 12 గంటల వరకు ఎండ రానుండగా.. ఆ తర్వాత పాక్షికంగా మబ్బులు కమ్మేయనున్నాయి.

పిచ్ ఎలా ఉంది?
లార్డ్స్ పిచ్ సంప్రదాయంగా అయితే బ్యాటింగ్‌కు అనుకూలం. కానీ గత కొన్నేళ్లుగా ఇక్కడ బౌలర్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు పేసర్లకు సహకరిస్తాయనే అంచనాలున్నాయి. ఈ మైదానంలో వన్డే తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 238గా ఉంది. ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన 70 మ్యాచ్‌ల్లో 33 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు, 32 సార్లు ఛేదన జట్లు గెలిచాయి. టాస్ గెలిచి జట్టు ముందుగా ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ముఖా ముఖి పోరు..
ఇప్పటివరకూ లార్డ్స్‌లో భారత్ ఆడిన వన్డేలు. నాలుగింట్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో ఇంగ్లండ్‌తో ముఖాముఖిలో భారత్‌దే కాస్త పైచేయి. ఇప్పటివరకు రెండు జట్లు 104 మ్యాచ్‌ల్లో తలపడగా భారత్ 56 విజయాలు సాధించింది. ఇంగ్లండ్ 43 మ్యాచ్‌ల్లో నెగ్గింది. రెండు టైగా ముగిశాయి. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

కోహ్లీ దూరం..
గజ్జలో గాయానికి గురైన విరాట్ కోహ్లీకి ఇంకా కోలుకోలేదు. అతను రెండో వన్డేకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి గాయం తీవ్రత ఎంతో ఇంకా తెలియలేదు. 'రెండో వన్డేకు కూడా విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. అతని గజ్జలో గాయం ఇంకా నయం కాలేదు. ' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇటీవల వరుస వైఫల్యాలతో కోహ్లీ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్, సెహ్వాగ్ వంటి మాజీ ఆటగాళ్లు టీ20 జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నించారు. కోహ్లీ స్థానంలో తొలి మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ రెండో మ్యాచ్‌లోనూ కొనసాగనున్నాడు.

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్, ధావన్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, హార్దిక్, జడేజా, షమి, బుమ్రా, చాహల్, ప్రసిద్ధ్
ఇంగ్లాండ్: రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, ఒవర్టన్, విల్లీ, కార్స్, టాప్లీ


Click it and Unblock the Notifications












