India vs England 2nd ODI Preview: సూర్యకు లైన్ క్లియర్.. రెండు మార్పులతో బరిలోకి భారత్! తుది జట్టు ఇదే!!

పూణే: తొలి వన్డేలో పటిష్ట ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా రెండో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం పూణేలోనే జరిగే రెండో మ్యాచులో మరో విజయం అందుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. మూడో వన్డేతో సంబంధం లేకుండా 2-0తో సిరీస్ కొట్టేయాలని భావిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 1.30కు మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో వన్డేలో కోహ్లీసేన రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

సూర్యకు లైన్ క్లియర్
ఇప్పటికే గాయం కారణంగా మిగతా వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో.. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీ20 అరంగేట్రం చేసిన అతడు.. ఈ మ్యాచ్‌తో వన్డేల్లోనూ నేషనల్ టీమ్ తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నాడు. టీ20ల్లో దుమ్మురేపిన సూర్యకుమార్.. వన్డేల్లో కూడా '360 డిగ్రీల్లో' షాట్లు బాదేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. మోచేతికి గాయం కావడంతో తొలి మ్యాచులో ఓపెనర్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేయలేదు. బహుశా అతడు కోలుకుంటాడని అంటున్నారు. లేదంటే అతడి స్థానం భర్తీ చేసేందుకు శుభ్‌మన్ గిల్ సిద్ధంగా ఉన్నాడు.

చహల్‌కు చోటు
రోహిత్ శర్మ కోలుకోకుంటే.. కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపించి రిషబ్ పంత్‌ను మిడిలార్డర్‌లో ఆడించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ రాణించడం జట్టుకు శుభవార్త. విరాట్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. పాండ్యా సోదరుల బ్యాటింగ్ అదనపు బలం. ఇక తొలి వన్డేలో విఫలమైన స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ స్థానంలో లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ విభాగాన్ని పంచుకోనున్నారు.

మిడిలార్డర్ వైఫల్యమే
సునాయాసంగా గెలిచేలా కనిపించిన ఇంగ్లండ్‌ను మిడిలార్డర్ వైఫల్యమే దెబ్బతీసింది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, జేసన్ రాయ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. 14 ఓవర్లకే 135 పరుగులు సాధించారు. అయితే మిడిలార్డర్లో బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆకట్టుకోలేకపోయారు. మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ గాయపడ్డాడు.
వీరిద్దరూ రెండో వన్డేలో ఆడటంపై స్పష్టత లేదు. ఒకవేళ ఇంగ్లండ్ భారీ లక్ష్యం నిర్దేశించాలన్నా.. ఛేదించాలన్నా వీరంతా దూకుడుగా ఆడటం ముఖ్యం. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తమ స్పిన్‌తో కోహ్లీసేనను ఇబ్బంది పెట్టలేకపోయారు. మార్క్ వుడ్, టామ్ కరన్, సామ్ కరన్, బెన్ స్టోక్స్ రాణించడం ఆ జట్టుకు సానుకూలాంశం.

భారత్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, యజువేంద్ర చహల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, భువనేశ్వర్ కుమార్.
India vs England: వన్డే క్రికెట్‌లో అత్యధికసార్లు 90ల్లో ఔటైన భారత ఓపెనర్లు వీరే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications