భారత్‌కు అనుకూలంగా నిర్ణయాలు.. థర్డ్ అంపైర్ తప్పిదాలపై ఇంగ్లండ్ ఓపెనర్ ఫైర్

అహ్మదాబాద్: మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్ట్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే అన్నాడు. ఇది తమను తీవ్ర అసహనానికి గురిచేసిందని తెలిపాడు. బుధవారం ప్రారంభమైన పింక్‌బాల్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి 99/3తో నిలిచింది.
రోహిత్(57 బ్యాటింగ్), అజింక్యా రహానె(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు శుభ్‌మన్ గిల్(11), పుజారా(0), విరాట్ కోహ్లీ(27) ఔటయ్యారు. అయితే.. శుభ్‌మన్ గిల్, రోహిత్ విషయాల్లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా వచ్చాయని క్రాలే ఆరోపించాడు.

క్యాచ్ విషయంలో..
తొలుత స్టువర్ట్‌బ్రాడ్ బౌలింగ్‌లో గిల్ ఇచ్చిన క్యాచ్‌ను బెన్ స్టోక్స్ అందుకున్నప్పటికీ బంతి కొద్దిగా నేలకు తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ఇచ్చాడు. ఇక 31వ ఓవర్‌లో లీచ్ బౌలింగ్‌లో రోహిత్ స్టంపౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రెండు విషయాలపై ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో కాసేపు వాగ్వాదానికి దిగాడు.
రోహిత్ శర్మ విషయంలో మూడో అంపైర్ రీప్లేను అన్ని కోణాల్లో చూడలేదని, అలా చూసి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదన్నాడు. ఈ నేపథ్యంలోనే అసహనం వ్యక్తం చేసిన క్రాలే.. ఆ నిర్ణయాలు తమకు అనుకూలంగా రావాల్సిందని చెప్పాడు. అవి తమకెంతో విలువైనవని అభిప్రాయపడ్డాడు.

అంపైరింగ్ నిర్ణయాలు..
'మేం ఆటలో వెనుకబడ్డాం. ఇలాంటి పాక్షపాత అంపైరింగ్ నిర్ణయాలు విసుగు తెప్పిస్తున్నాయి. ఇలా అటు-ఇటు ఉన్న ఫలితాలు మాకు అనుకూలంగా రావాల్సి ఉంది. కానీ, పరిస్థితులు చూస్తుంటే ఒక్కటి కూడా మాకు లాభించలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నిర్ణయాలు మాకు అనుకూలంగా రాకపోతే మేం మ్యాచ్ గెలవలేం.
కానీ, అవి మా చేతుల్లో లేవు. రానున్న రోజుల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం' అని ఈ ఇంగ్లండ్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ గెలవడానికి తమకు అవకాశలున్నాయని, అది జరగాలంటే అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదని చెప్పాడు. రెండోరోజు ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి టీమిండియా లీడ్‌ను వీలైనంత తగ్గిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

అక్షర్ సిక్సర్..
ప్రధాన బౌలర్ కాకపోయినా... అక్షర్ పటేల్ (6/38) ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో స్పిన్నర్ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు ఒక వికెట్ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 2 వికెట్లు తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications