For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ చెత్త ఫీల్డింగ్‌పై మైకేల్ వాన్ సెటైర్స్.. నువ్వే మాట్లాడాలంటూ ఫ్యాన్స్ ఫైర్!

India vs England 2021: Michael Vaughan takes a cheeky dig at Team India players for dropping catches in the third ODI
Ind vs Eng 3rd ODI : Michael Vaughan Comments On India's Fielding & Dropping Catches In 3rd ODI

పుణె: ఓ వైపు బ్యాట్స్‌మెన్.. మరోవైపు బౌలర్లు సమయోచితంగా రాణించడంతో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయాన్నందుకుంది. దాంతో ఆదివారం జరిగిన డిసైడర్ వన్డేలో ఇంగ్లండ్ 7 పరుగులతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఘోర తప్పిదాలు చేశారు. కీలక సమయంలో క్యాచ్‌లు చేజార్చి సులువుగా గెలిచే మ్యాచ్‌ను సంక్లిష్టం చేసుకున్నారు. దాంతో భారత ఫీల్డింగ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంగ్లండ్.. భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న మైకేల్.. తాజా మ్యాచ్‌పై కూడా తనదైన వ్యాఖ్యలు చేశాడు.

నువ్వే మాట్లాడాలి..

'భారత జట్టు కోసం ఈ వారం నా ఫీల్డింగ్ క్రికెట్ అకాడమీని ఓపెన్ చేసినందుకు భయపడుతున్నాను'అని సెటైరిక్‌గా కామెంట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డింగ్ గురించి నువ్వే మాట్లాడాలి ఇక అంటూ.. అతని పాత వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో సునాయస క్యాచ్‌లను మైకేల్ వాన్ నేలపాలు చేశాడు. అంతేకాకుండా నీ కన్నా భారత ఆటగాళ్లు బాగానే చేస్తున్నారని చురకలంటిస్తున్నారు. 'ముందు నుంచి వెళ్లే బంతులను కూడా ఆపలేవు.. నువ్వా ఫీల్డింగ్ గురించి మాట్లాడేది'అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు సిసలు మజా..

ఇక ఇంగ్లండ్.. భారత్ పర్యటన ఆద్యాంతం ఆకట్టుకుందని, అసలు సిసలు మజా లభించిందని వాన్ ట్వీట్ చేశాడు. 'ఇంగ్లండ్.. ఇండియా పర్యటన అద్భుతంగా సాగింది. డ్రామా, వివాదాలు, అనేక చర్చలతో అసలు సిసలు క్రికెట్ మజా లభించింది'అని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా భువనేశ్వర్ కుమార్‌కు మ్యాన్ ఆఫ్ సిరీస్ రాకపోవడంపై కూడా స్పందించాడు. అసలు ఎందుకు రాలేదని నెటిజన్లను ప్రశ్నించాడు. భారత అభిమానులకు హోలీ శుభాకాంక్షలు సైతం చెప్పాడు.

అవాక్కైన కోహ్లీ..

అవాక్కైన కోహ్లీ..

సామ్ కరన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌' అవార్డు, బెయిర్ స్టోకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ... 'భువనేశ్వర్ కుమార్, శార్దూల్‌ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిడిల్‌ ఓవర్స్‌లో బౌలర్లు వికెట్లు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టాడు. 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్'‌గా శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నా. కానీ అందుకు భిన్నంగా సామ్‌ కరన్‌ ఎంపిక విస్మయానికి గురిచేసింది. ఇక ప్లేయర్‌ 'ఆఫ్‌ ది సిరీస్'కు‌ భువనేశ్వర్‌ అర్హుడు' అని అన్నాడు.

వణికించిన సామ్ కరన్..

వణికించిన సామ్ కరన్..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్‌ (67), పంత్‌ (78) హార్దిక్‌ (64) అర్ధ శతకాతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్‌వుడ్‌ (3/34), రషీద్‌ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడిన సామ్‌ కరన్‌ (95 నాటౌట్‌) భారత్‌ను భయపెట్టాడు. మలన్‌ (50) ఫర్వాలేదనిపించాడు. శార్దూల్‌ (4/67), భువనేశ్వర్‌ (3/42) కుమార్ సత్తాచాటారు. ఆఖరి ఓవర్‌లో తనదైన యార్కర్లతో నటరాజన్ ప్రత్యర్థిని కట్టడి చేసి విజయాన్నందించాడు.

Story first published: Monday, March 29, 2021, 14:51 [IST]
Other articles published on Mar 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+