Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా వద్ద కుర్రాళ్లను తయారు చేసే యంత్రం ఉన్నట్లుంది: పాక్ మాజీ క్రికెటర్

India vs England 2021: Inzamam-ul-Haq says India have a machine to manufacture youngsters for every format
Ishan, Surya, Krunal, Prasidh టీమిండియా వద్ద మెషిన్‌ గన్‌ ఉన్నట్లుంది... సత్తా చాటుతున్నారు!!

కరాచీ: ఫార్మాట్‌కు తగ్గట్లు యువ ఆటగాళ్లను తయారు చేయడానికి టీమిండియా వద్ద ఏదైనా యంత్రం ఉన్నట్లుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తెలిపాడు. భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదువ లేదని, రోజుకో ఆటగాడు అరంగేట్రం చేస్తూ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సత్తా చాటుతున్నారని కొనియాడాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేతో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా, ప్రసిధ్ కృష్ణలను ఉద్దేశించి ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఈ ఇద్దరిని ప్రశంసించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత్-ఇంగ్లండ్ ఫస్ట్ వన్డేను విశ్లేషించిన ఇంజమామ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఏదో యంత్రం ఉంది..

ఏదో యంత్రం ఉంది..

'ఫార్మాట్‌కు తగ్గట్లు యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు టీమిండియా దగ్గర ఏమైనా యంత్రం ఉన్నట్లుంది. రోజుకో ఆటగాడు జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఒకరు బ్యాటింగ్‌‌లో చెలరేగితే.. మరొకరు బౌలింగ్‌లో విజృంభించారు.

అరంగేట్రంలోనే రాణిస్తే జట్టులో సీనియర్ల పక్కన స్థానం సుస్థిరం చేసుకునే అంశాన్ని ఈ తరం ఆటగాళ్లు ఒంట బట్టించుకున్నారు. గత 6 నెలలుగా చూసుకుంటే.. ఆసీస్‌ సిరీస్‌ నుంచి మొదలుకొని జట్టులోని యువ ఆటగాళ్లంతా అదరగొట్టేస్తున్నారు. సీనియర్స్‌ వాళ్ల పాత్ర పోషిస్తుండగా.. జూనియర్లు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెచ్చిపోతున్నారు.

అదే టర్నింగ్ పాయింట్..

అదే టర్నింగ్ పాయింట్..

ఆస్ట్రేలియా పర్యటనలో నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషభ్ పంత్‌.. తాజగా ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ప్రసిధ్‌ కృష్ణ, కృనాల్‌లు అందుకు ఉదాహరణ. ప్రస్తుతం భారత్‌ ఆడుతున్న క్రికెట్‌లో నాణ్యత ఎక్కువగా కనిపిస్తుంది.. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇలాగే కొనసాగిస్తే మాత్రం రాబోయే టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ ఎగురేసుకుపోవడం ఖాయం.

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రాహుల్‌- కృనాల్‌ల మధ్య ఏర్పడిన 112 పరుగుల భాగస్వామ్యం టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. 270 పరుగుల వద్దే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగుస్తుందన్న దశలో వీరిద్దరు కలిసి జట్టు స్కోరు 300 ధాటించారు. అందులో కృనాల్‌ 31 బంతుల్లోనే 58 పరుగులు సాధించడం చూస్తుంటే టీమిండియా వద్ద మెషిన్‌ గన్‌ ఉన్నట్లుగా అనిపిస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

అదరగొట్టిన కృనాల్, ప్రసిధ్

అదరగొట్టిన కృనాల్, ప్రసిధ్

ఈ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శిఖర్‌ ధావన్‌ (106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్‌ రాహుల్‌ (43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 నాటౌట్‌), కృనాల్‌ పాండ్యా (31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 నాటౌట్‌), కోహ్లీ (60 బంతుల్లో 6 ఫోర్లతో 56) అర్ధ సెంచరీలు చేశారు.

అనంతరం ఇంగ్లండ్‌ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ప్రసిధ్‌ కృష్ణకు 4, శార్దుల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే శుక్రవారం ఇదే వేదికగా జరుగనుంది.

Story first published: Thursday, March 25, 2021, 12:42 [IST]
Other articles published on Mar 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+