IND vs ENG 1st Test: తొలి రోజు వర్ష గండం లేదు.. కానీ మైదానాన్ని మబ్బులు కమ్మెస్తాయి.. పేసర్లదే రాజ్యం!

నాటింగ్‌హమ్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ప్రారంభం కానున్న ఫస్ట్ టెస్ట్‌తో నెలన్నరపాటు సాగే ఈ బిగ్ సిరీస్ మొదలవ్వనుంది. ఈ సిరీస్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌కు తెరలేవనుంది. దాంతో ఇరు జట్లు బోణీ కొట్టాలని భావిస్తున్నాయి. ఇక న్యూజిలాండ్ చేతిలో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన భారత్.. మళ్లీ సత్తాచాటేందుకు సిద్దమవుతుండగా.. అదే టీమ్ చేతిలో సొంతగడ్డపై ఓడిన ఇంగ్లండ్ గాడిన పడాలని భావిస్తోంది.

పేసర్లేదే రాజ్యం..
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో వాతావరణం భారత్ పతనాన్ని శాసించింది. వర్షం కారణంగా మూడున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోగా.. రిజర్వ్‌డేతో కలుపుకొని రెండున్నర రోజుల ఆటే సాధ్యమైంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మాదిరే ఈ సిరీస్‌లోనూ వాతావారణం కీలక పాత్ర పోషించనుంది. ఫస్ట్ టెస్ట్‌కు వర్షం ముప్పు ఏం లేకపోయినప్పటికీ.. మైదానాన్ని మేఘాలు కమ్ముకొని చల్లని గాలులు వీచే అవకాశం ఉంది. అదే జరిగితే పేసర్ల రాజ్యం నడవనుంది. ముఖ్యంగా స్వింగ్ బౌలర్లు కింగ్ అవ్వనున్నారు. అప్పుడు ఆతిథ్య బౌలర్లకు అడ్వాంటేజ్ కానుంది.

సిరాజ్‌కు చాన్స్
బౌలింగ్ లైనప్‌లో స్వింగ్ చేసే బౌలర్ లేడన్నది తప్పితే పెద్దగా లోపాలేమీ లేవు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లతో కూడిన పేస్ బౌలింగ్‌తోపాటు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. సిరాజ్ బాల్‌ను స్వింగ్ చేయగలడు. అక్కడి కండిషన్స్ అతని బౌలింగ్‌కు బాగా సూటవుతాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతన్ని తీసుకోకుండా చేసిన పొరపాటును కోహ్లీ ఈసారి రిపీట్ చేయకపోవచ్చు.

దెబ్బకు దెబ్బ..
ఇంగ్లండ్ భారత్‌కు వచ్చినప్పుడు పూర్తిగా స్పిన్ పిచ్‌లతో వాళ్ల బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. అశ్విన్ ఏకంగా 32 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ వంతు వచ్చింది. దీంతో పచ్చికతో కూడిన పేస్ పిచ్‌లతో భారత బ్యాట్స్‌మెన్‌కు స్వాగతం పలకడానికి ఆ టీమ్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా అండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్ బౌలర్లు ఇండియన్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ టెస్ట్‌కు సిద్దం చేస్తున్న పిచ్‌పై పచ్చిక చూస్తుంటే పేస్, స్వింగ్‌కు అనుకూలించవచ్చు. పైగా అండర్సన్ సైతం మీడియా సమావేశంలో ఈ విషయాన్నే వెల్లడించాడు. క్రికెట్ పిచ్‌లను తమకు అనుకూలంగా తయారుచేసినా 'కోహ్లీసేన' అభ్యంతరం వ్యక్తం చేయదన్నాడు.

తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ/ మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలీ, జోరూట్(కెప్టెన్), ఓలీపోప్, జోస్ బట్లర్(కీపర్), సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications